Naga Chaitanya తో విడాకుల తర్వాత సమంతపై సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ లో వెలువడిన పుకార్లు సాధారణమైనవి కాదు. ఒక రకంగా చెప్పాలంటే అవి భరించలేని నిందలు. తన స్టైలిస్ట్ తో సామ్ సంబంధం పెట్టుకుందని, ప్రెగ్నన్సీకి నో చెప్పిందని, సరోగసి ద్వారానే పిల్లలు కావాలని కోరిందని అంటూ సమంత వ్యక్తిత్వంపై దెబ్బ కొట్టేలా ఎన్నో పుకార్లు వినిపించాయి. వీటన్నింటికి సామ్ సోషల్ మీడియా ద్వారా సమాధానం ఇచ్చింది. సామ్ తో తన రిలేషన్ షిప్ పై వస్తున్న పుకార్ల విషయంలో నాగ చైతన్య మౌనంగా ఉండడాన్ని స్టైలిస్ట్ ప్రీతమ్ తప్పుబట్టారు కూడా.