వీరిద్దరూ కలిసి చేసిన మొదటి మూవీ ఏం మాయ చేసావే. తొలి చూపులోనే ప్రేమలో పడ్డ వీరు, కొద్దిరోజులు ఎవరికీ తెలియకుండా రహస్య ప్రేమాయణం నడిపించారు. చివరికి ఇద్దరూ ఇంట్లో పెద్దలను ఒప్పించి వివాహం ద్వారా ఒకటై పోయారు. కానీ సమంత ఇంట్లో మాత్రం నాగచైతన్యతో పెళ్లి అంటే ఒప్పుకోలేదట. కానీ సమంత పట్టుబట్టి నేను చేసుకుంటే అతన్నె చేసుకుంటా లేదంటే ఇక పెళ్లి వద్దు అన్నట్టుగా గట్టిగా మాట్లాడరట.