తెలుగు సినిమా పరిశ్రమకు మాత్మే కాదు.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన డైరెక్టర్ కూడా రాజమౌళినే. ఎన్నో ఏళ్లుగా ఇండియన్ సినిమాపై ఆధిపత్యం వహిస్తున్న హిందీ సినిమా కోరలు పీకేసి.. తెలుగు జెండా ఎగరేసిన దర్శకుడు జక్కన్న. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్టామినాను ఇండియాకు పరిచయం చేశాడు రాజమౌళి.