Samantha: తెల్ల చీరలో కట్టిపడేస్తున్న సమంత.. ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌.. చేతిలో రుద్రాక్ష చర్చనీయాంశం..

Published : Jan 09, 2023, 01:55 PM ISTUpdated : Jan 09, 2023, 02:26 PM IST

సమంత చాలా రోజుల తర్వాత బయటకొచ్చింది. ఇటీవల ఎయిర్‌పోర్ట్ లో మెరిసిన ఈ భామ ఇప్పుడు `శాకుంతలం` ప్రెస్‌మీట్‌లో హైలైట్‌గా నిలిచింది. ఆకట్టుకుంటుంది. 

PREV
16
Samantha: తెల్ల చీరలో కట్టిపడేస్తున్న సమంత.. ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌.. చేతిలో రుద్రాక్ష చర్చనీయాంశం..

సమంత నటించిన `శాకుంతలం` ట్రైలర్‌ వచ్చింది. శకుంతలగా ఆమె చేసిన మ్యాజిక్‌ హైలైట్‌గా నిలచింది. నటన, అందం అబ్బురపరిచేలా ఉంది. ట్రైలర్‌ ట్రెండ్‌ అవుతుంది. అలాగే సమంత అందం కూడా వైరల్‌ అవుతుంది. ఆమె ఈసందర్భంగా దిగిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 

26

ఇందులో సమంత వైట్‌ శారీలో తెల్లపావురంలా మెరిసిపోతుంది. ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. పలుచని ఉల్లిపోర లాంటి చీరలో మంత్రముగ్దుల్ని చేస్తుంది సమంత. ప్రస్తుతం ఆమె ఫోటోలు  నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఎంతో అందంగా మైమరపింప చేస్తుంది సమంత. 
 

36

అయితే ఇందులో తన చేతిలో ఉన్న రుద్రాక్షమాల ఏంటందనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అది రాముడి రుద్రాక్ష మాలగా తెలుస్తుంది. మరి సినిమా కోసం దాన్ని క్యారీ చేసిందా? ఆరోగ్యం కోసమా? అనేది సస్పెన్స్ నెలకొంది. సమంత గతేడాది నుంచి మయోసైటిల్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. దాన్నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. 

46

అయితే అభిమానులకు కనిపించాలనే ఉద్దేశ్యంతో ఆమె మీడియా ముందుకొచ్చినట్టు చెప్పింది సమంత. ఎంతో శక్తిని కూడగట్టుకుని వచ్చానని తెలిపింది. ఈ సందర్భంగా ఆమె ఎమోషనల్‌ అయ్యింది. సినిమా కోసం తమ కష్టాన్ని దర్శకుడు గుణశేఖర్‌ చెబుతూ ఎమోషనల్‌ అయిన నేపథ్యంలో సమంత సైతం భావోద్వేగానికి గురయ్యింది. కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. 

56

సమంత చాలా కాలం తర్వాత మీడియా ముందుకు, బయటకు రావడంతో ఆమె అభిమానులు ఖుషి అవుతున్నారు. సంబరపడుతున్నారు. సినిమాకి ధైర్యాన్నిచే ప్రయత్నం చేశారు. ఈ ఈవెంట్‌లో `శాకుంతలం` సినిమాకి సమంతనే హీరో అని దర్శకుడు చెప్పిన విషయం తెలిసిందే. 

66

ఇక సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో దేవ్‌ మోహన్‌ మెయిన్‌ మేల్‌ లీడ్‌గా దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నారు. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాని గుణ టీమ్‌ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాలపై దిల్‌రాజు, నిలిమా గుణ నిర్మించారు. ఈ చిత్రం ఫిబవరి 17న పాన్‌ ఇండియన్‌ మూవీగా తెలుగు, తమిలం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories