నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత బాగా బిజీగా మారిపోయింది. బాలీవుడ్ లో కూడా నటించేందుకు సామ్ రెడీ అవుతోంది. సమంత ఇటీవల నటించిన కన్మణి రాంబో ఖతీజా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలాంటి బజ్ క్రియేట్ చేయలేకపోయింది. క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి సరైన స్పందన రాలేదు.