ఈటీవీ ప్రోగ్రామ్స్ నుండి దాదాపు సుధీర్ కనుమరుగయ్యారు. జబర్దస్త్ తో పాటు ఢీ 14, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ నుండి తప్పుకున్నాడు. ఈ మధ్య స్టార్ మా కి షిఫ్ట్ అయిన సుధీర్, ఆల్రెడీ అనసూయతో కలిసి ఓ షో చేస్తున్నారు. చిన్న పిల్లల సింగింగ్ షో ఇటీవల మొదలు కాగా... సుధీర్, అనసూయ యాంకర్స్ గా వ్యవహరిస్తున్నారు.