సమంత సీరియస్ లుక్ చూశారా.. స్టన్నింగ్ ఫోటోస్ వైరల్

First Published | Nov 6, 2021, 4:32 PM IST

మానసిక వేదన మిగిల్చిన విడాకుల సంఘటన నుంచి సమంత ఇప్పుడిప్పుడే కోలుకునే ప్రయత్నం చేస్తోంది. ఎంతో ఇష్టపడి ప్రేమించుకుని వివాహం చేసుకున్న సమంత, నాగ చైతన్య జీవితంలోకి తుఫానులా విభేదాలు వచ్చాయి.

మానసిక వేదన మిగిల్చిన విడాకుల సంఘటన నుంచి సమంత ఇప్పుడిప్పుడే కోలుకునే ప్రయత్నం చేస్తోంది. ఎంతో ఇష్టపడి ప్రేమించుకుని వివాహం చేసుకున్న సమంత, నాగ చైతన్య జీవితంలోకి తుఫానులా విభేదాలు వచ్చాయి. విభేదాలు తారా స్థాయికి చేరడంతో వీరిద్దరూ విడిపోక తప్పలేదు. 

ప్రస్తుతం Samantha తిరిగి తన పనులతో బిజీ అయిపోయింది. కొత్త చిత్రాలకు సైన్ చేస్తోంది. ఫోటో షూట్స్ తో బిజీగా గడుపుతోంది. ఇటీవల సమంత కొన్ని రోజులు తీర్థయాత్రలకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. తన స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలసి సమంత నార్త్ లో పలు ఆలయాలు సందర్శించింది. 


ఇటీవల వెకేషన్స్ కి కూడా వెళ్ళింది సమంత. అలాగే సోషల్ మీడియాలో ఆమె పెడుతున్న పోస్ట్ లు చూస్తుంటే బ్రేకప్ వల్ల ఎంతటి మానసిక వేదన అనుభవిస్తోందో అర్థం చేసుకోవచ్చు. సమంత Naga Chaitanya విడిపోవడంపై అనేక రూమర్లు వినిపించాయి. సమంతని బ్లేమ్ చేస్తూ సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ లో ఎన్నో కథనాలు వచ్చాయి. సమంత పిల్లలు కనేందుకు ఒప్పుకోలేదని, తన స్టైలిస్ట్ తో సంబంధం పెట్టుకుందని ఎన్నో పుకార్లు సృష్టించారు. దీనితో సమంత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై కోర్టులో పరువునష్టం దావా వేసింది. ఈ కేసులో సమంత విజయం సాధించింది. 

ఇప్పుడు సమంత గురించి ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. సమంత ఇంస్టాగ్రామ్ వేదికగా పరోక్షంగా చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సమంత సోషల్ మీడియాలో చాల యాక్టివ్. ఇన్స్టా లో ఆమెని దాదాపు 20 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. తరచుగా ఫోటో షూట్స్ చేస్తూ ఆ ఫోటోలని సమంత అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

తాజాగా సమంత ఓ డిజైనర్ డ్రెస్ లో మెరిసింది. సీరియస్ లుక్ లో సూపర్ స్టైలిష్ గా సామ్ అదరగొడుతోంది. సమంత తనదైన శైలిలో ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. దీపావళి సందర్భంగా రెడ్ డ్రెస్ లో మెరిసిన సామ్.. తాజాగా మరో ఫోటో షూట్ చేసింది. 

Also Read: Jai Bhim: 'జై భీమ్' మూవీపై సీపీఐ నారాయణ కామెంట్స్..37 ఏళ్ల క్రితం తిరుపతిలో జరిగిన సంఘటన గుర్తొచ్చింది

ఇక సినిమాల విషయానికి వస్తే సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే పౌరాణిక గాధలో నటిస్తోంది. ఈ చిత్రంలో సమంత భాగం షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అలాగే తెలుగు తమిళ ద్విభాషా చిత్రానికి సామ్ ఇటీవల ఓకె చెప్పింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 

Latest Videos

click me!