స్కూల్ డేస్ నుండి ప్రేమించుకుంటున్న అమృత, ప్రణయ్ 2018 జనవరిలో పెళ్లి చేసుకున్నారు. సామాజికంగా, ఆర్థికంగా తమ కంటే తక్కువ స్థాయి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అమృత తండ్రి మారుతీరావు కి నచ్చలేదు. దీంతో కిరాయి వ్యక్తులతో నాలుగు నెలలు ప్లాన్ చేయించి, మర్డర్ చేయించాడు. ప్రణయ్ మర్డర్ తో సంబంధం ఉన్న మారుతీరావు తో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పై బయటికి వచ్చిన మారుతి రావు, హైదరాబాద్ లోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకొని మరణించాడు.