కొడుకు ప్రేమ కోసం తపన పడుతున్న మహేంద్ర.. వసుపై కోపాన్ని పెంచుకుంటున్న రిషి?

First Published Nov 6, 2021, 2:19 PM IST

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా టాప్ లో ఉంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
 

శిరీష్, వసు (Sireesh, Vasu) రిషి వాళ్ళ ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక శిరీష్ రిషితో మాట్లాడటానికి రాగా రిషిని కిందకు పిలవమని మహేంద్ర వర్మ (Mahindra) వసుకు చెప్పి వసును ధరణి తో రిషి దగ్గరకి పంపిస్తాడు. ఇక ధరణి మధ్యలో తనకు వంటగదిలో పని ఉందని చెప్పి వసును పంపిస్తుంది.
 

ఇక వసు (Vasu) తన మనసులో ఈ ఆర్టికల్ రిషి సార్ కి ఇస్తే సంతోషంగా ఫీల్ అవుతాడు అని అప్పుడు కోపం తగ్గిపోతుందని అనుకుంటుంది. ఇక రిషి దగ్గరికి వెళ్ళేసరికి రిషి (Rishi) కోపంలో బాక్సింగ్ చేస్తూ బాగా బిజీగా ఉంటాడు. వసు మాట్లాడటానికి ప్రయత్నిస్తే తనను కొన్ని సూటిపోటి మాటలతో కాస్త బాధ పెడతాడు.
 

వసు ఏమీ అనలేక బాధపడుతూ తాను రాసిన ఆర్టికల్ పేపర్ టేబుల్ పై పెట్టి వెళ్తుంది. రిషి (Rishi) వసుని అలాగే చూస్తూ కోపంతో రగిలిపోతాడు. వసు తెచ్చిన ఆర్టికల్ పేపర్ ను మడిచి చెత్త బుట్టలో వేస్తాడు. వసు మహేంద్రవర్మ దగ్గరికి వచ్చి శిరీష్ (Sireesh) తో తర్వాతకు మాట్లాడతాడు అని నాతో మాట్లాడే అవకాశాన్ని కూడా ఇవ్వలేదని చెప్పి వెళ్లిపోతుంది.
 

మహేంద్ర వర్మ (Mahindra) తన మనసులో.. రిషి ఇంకా బయట పడటం లేదు అని బాధ పడతాడు. వసు పై ఉన్న ప్రేమను బయట పెట్టడం లేదని తపన పడతాడు. కాలేజీలో జగతి (Jagathi) మిషన్ ఎడ్యుకేషన్ గురించి కాలేజ్ ఫ్యాకల్టీ వాళ్లకు వివరిస్తూ అందులో ట్రైనింగ్ గురించి చెబుతుంది. ఆర్టికల్ కూడా వసు బాగా రాసిందని వాళ్లు పొగుడుతుంటారు.
 

మహేంద్ర వర్మ రిషి (Rishi) గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే రిషి లోపలికి చిరాకుగా వస్తాడు. కాసేపు తన తండ్రితో మాటల యుద్ధం చేస్తాడు. జగతి (Jagathi) వచ్చి మిషన్ ఎడ్యుకేషన్ గురించి చెప్పటంతో వెంటనే రిషి ఇప్పుడు ఇది వద్దంటూ త్వరలోనే ఎగ్జామ్స్ ఉన్నాయని ఎగ్జామ్స్ తర్వాత మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచిద్దామని చెబుతాడు.
 

ఇక జగతి (Jagathi) రిషి చెప్పినట్లు విని వెళ్ళిపోతుంది.  మహేంద్రవర్మ జగతిని అలాగే చూస్తూ ఉండటంతో మళ్లీ రిషి (Rishi) కావాలని తన మాటలతో కాస్త రెచ్చగొట్టినట్లు ప్రవర్తిస్తాడు. అంతేకాకుండా పెళ్లి, పేరంటాలు అంటూ  శిరీష్ వాళ్ల గురించి కోపంతో మహేంద్ర వర్మ పై అరుస్తాడు.
 

మరోవైపు వసు (Vasu) బోర్డుపై లెక్కలు చెబుతూ రిషిలాగా ప్రవర్తిస్తుంది. అప్పుడే రిషి వచ్చి తనను గమనిస్తూ ఉంటాడు. తరువాయి భాగంలో శిరీష్ (Sireesh), వసు (Vasu) కోసం రావటంతో మనసులో బాధలు మింగు కొని కోపంగా ప్రవర్తిస్తాడు.

click me!