మంకీతో సమంత సెల్ఫీలు.. సామ్ ను ఇంత హ్యాపీగా చూసి ఖుషీ అవుతున్న ఫ్యాన్స్..

First Published | Jul 27, 2023, 1:11 PM IST

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం హాలీ డేస్ ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నేచర్ కు చాలా దగ్గరగా ఉంటోంది. ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటున్నట్టు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కొద్దికాలంగా ఆమె ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుండటంతో పూర్తిగా కోలుకునే వరకు షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చింది. 
 

ఈ సమయాన్ని సమంత తన స్నేహితులతో కలిసి సరదగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా దేవాలయాలను, మెడిటేషన్ సెంటర్లు, వేకెషన్లకు వెళ్తున్నారు. ఇప్పటికే సద్గురు ఈషా సెంటర్ లో కనిపించిన విషయం తెలిసిందే. అంతకు ముందుకు ఓ పుణ్యక్షేత్రంలోనూ దేవుడి దర్శనం చేసుకున్నారు. 
 


ఇక ప్రస్తుతం సమంత ఇండోనేషియాలో ఎంజాయ్ చేస్తున్నారు.  బ్యూటీఫుల్ లోకేషన్లను సందర్శిస్తూ రిలాక్స్ అవుతున్నారు. తాజాగా సమంత ఇండోనేషియాలోని ఉబుద్ బాలిలో గల ’మంకీ ఫారెస్ట్‘ను సందర్శించారు. అక్కడ తన ఫ్రెండ్స్ తో కలిసి సమయం గడిపారు. 
 

తాజాగా కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. మంకీలతో సెల్ఫీలు దిగుతూ.. వాటితో కలిసి అల్లరి చేస్తూ కనిపించింది. అలాగే ముఖం నిండా నవ్వుతో చాలా ఆనందంగా దర్శనమిచ్చింది. దీంతో ఇంత హ్యాపీగా సమంతను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. 
 

మొత్తానికి సమంత తన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఇలా ఎప్పటికప్పుడు తన హాలీడే ట్రిప్ కు సంబంధించిన అప్డేట్స్ ను అందిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఫ్యాన్స్,, నెటిజన్లు లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 
 

ఇక సమంత నటించిన రెండు సినిమాలు విడుదల కావాల్సి ఉన్నాయి. విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’, వరుణ్ ధావన్ తో కలిసి క్రేజీ సిరీస్ ‘సిటడెల్’ లో నటించింది. తన పాత్రలకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసుకుంది. తొలుత Kushiతో అలరించనుంది. ఈ మూవీ సెప్టెంబర్ 1న విడుదల కానుంది. 

Latest Videos

click me!