Anasuya: వెకేషన్ లో మరింత రొమాంటిక్ గా అనసూయ... అధ్యక్షా లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా?

Published : Jul 27, 2023, 11:47 AM ISTUpdated : Jul 31, 2023, 11:09 AM IST

అనసూయ లైఫ్ స్టైల్ చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆమె తన ప్రొఫెషన్ లో దూసుకుపోతూనే ఫ్యామిలీకి సమయం కేటాయిస్తుంది. క్వాలిటీ టైం ఎంజాయ్ చేస్తుంది. 

PREV
19
Anasuya: వెకేషన్ లో మరింత రొమాంటిక్ గా అనసూయ... అధ్యక్షా లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా?

అనసూయ కుటుంబ సభ్యులతో కాలిఫోర్నియా వెళ్లారు. తమ ట్రిప్ ఫోటోలు అనసూయ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అందమైన నగరంలో అనసూయ ఆహ్లాదంగా గడుపుతున్నారు. సాగర తీరాల్లో చల్లగా సేద తీరుతున్నారు. 

 

29

కాలిఫోర్నియాలో గల ప్రఖ్యాత గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ని సందర్శించారు. అనసూయ వెకేషన్ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ లైఫ్ అంటే అనసూయదే అంటున్నారు. అలాగే క్యూట్ అండ్ లవ్లీ ఫ్యామిలీ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 

39

టైట్ జీన్స్, టీ షర్ట్ ధరించి అనసూయ సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. భర్త సుశాంక్ భరద్వాజ్ తో అనసూయ రొమాంటిక్ పోజులు అద్భుతంగా ఉన్నాయి. 

 

49

మరోవైపు అనసూయ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఓ తరహా పాత్రలకు అనసూయ పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నారు. ఇటీవల ఆమె నటించిన విమానం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. 
 

59

విమానం మూవీలో అనసూయ వేశ్య రోల్ చేయడం విశేషం. బోల్డ్ రోల్ లో ఆమె ఒదిగిపోయి నటించారు. విమానం జీ 5 లో స్ట్రీమ్ అవుతుంది. ఓటీటీలో విమానం చిత్రానికి విశేష ఆదరణ దక్కింది. 

 

69

ఇక దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రంగమార్తాండ మూవీలో హైటెక్ కోడలిగా మెప్పించింది. రంగమార్తాండ సైతం అనసూయకు మంచి పేరు తెచ్చింది. 
 

79

ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో పాల్గొంటుంది. సీక్వెల్ లో సైతం అనసూయ దాక్షాయణిగా కనిపించనున్నారు. దర్శకుడు సుకుమార్ త్వరితగతిన ఈ క్రేజీ సీక్వెల్ షూట్ పూర్తి చేస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి. వేర్ ఈజ్ పుష్ప కాన్సెప్ట్ టీజర్ ఆకట్టుకుంది. 

 

89

అయితే అనసూయను బుల్లితెర ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు. అనసూయకు యాంకరింగ్ మీద విరక్తి పుట్టిందట. మేకర్స్ టీఆర్పీ కోసం ప్లే చేస్తున్న ట్రిక్స్ తనకు నచ్చడం లేదట. అందుకే యాంకరింగ్ మానేశానని ఆమె వెల్లడించారు. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని ఖరాకండిగా చెప్పింది. 


 

99

అనసూయ కెరీర్ కి జబర్దస్త్ పునాది వేసింది. సదరు కామెడీ షో ఊహించని విజయం సాధించగా... అనసూయ బుల్లితెర స్టార్ అయ్యారు. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ అనసూయ నటిగా ఎదిగారు. 

Read more Photos on
click me!

Recommended Stories