కురచ ప్యాంటు తిరగేసి వేసుకున్నావా... సమంత లుక్ పై నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్!

First Published Jan 21, 2021, 3:51 PM IST


సమంత ప్రస్తుతం ముంబైలో చక్కర్లు కొడుతున్నారు. తన డెబ్యూ వెబ్ సిరీస్ ఫ్యామిలీమాన్ 2 విడుదల నేపథ్యంలో ఆమె ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. దీని కోసం సమంత ప్రత్యేకమైన ఫోటో షూట్స్ చేస్తుండగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. 

ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ కాగా దానికి సీక్వెల్ గా ఫ్యామిలీ మాన్ 2 తెరకెక్కించడం జరిగింది. అమెజాన్ ప్రైమ్ లో ఫ్యామిలీ మాన్ 2 ఫిబ్రవరి 12నుండి స్ట్రీమ్ కానుంది.
undefined
ఈ సిరీస్ ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లిన సమంత అనేక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ప్రొమోషనల్ ఈవెంట్స్ కోసం సమంత ధరిస్తున్న డిజైనర్ వేర్ ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా సమంత ధరించి ఓ డ్రెస్ పై నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
undefined
బ్రౌన్ కలర్ టాప్, జీన్స్ ధరించిన సమంత అల్ట్రా స్టైలిష్ లుక్ లో దర్శనం ఇచ్చారు.
undefined
కాగా సమంత లుక్ కొందరు నెటిజెన్స్ కి నచ్చనట్టుంది. ఆమె జీన్స్ ప్యాంట్ అండ్ ఇయర్ రింగ్స్ పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
undefined
సమంత లేటెస్ట్ ఫొటోలతో మీమ్స్ రాజాలు పండగ చేసుకోవచ్చని ఒకరు కామెంట్ చేయగా...  మరొకరు ఇయర్ రింగ్స్ సైజు సరిపోతాయా, లేదా ఇంకా పెద్దవి కావాలా అని కామెంట్ పెట్టారు.
undefined
ఇక సమంత ప్యాంటుపై అయితే కొందరు క్రేజీ కామెంట్స్ చేయడం విశేషం. సమంత ప్యాంటు డిజైన్ డిఫరెంట్ గా ఉండగా.. కురచ ప్యాంటు తిరగేసి వేసుకున్నావా సమంత అని అడుగుతున్నారు.
undefined
క్యూట్ సమంత లేటెస్ట్ ఫోటో షూట్ లో డిఫరెంట్ లుక్ ట్రై చేయగా... ఫ్యాన్స్ కి అంతగా నచ్చినట్లు లేదు. అందుకే కొందరు సోషల్ మీడియా ద్వారా తమ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
undefined
ఫ్యామిలీ మాన్ 2లో మొదటిసారి సమంత ఓ నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారు. పాకిస్థాన్ కి చెందిన ముస్లిమ్ అమ్మాయిగా సమంత ఈ సిరీస్లో కనిపిస్తారట.
undefined
సమంత ఈ సిరీస్లో టెర్రరిస్ట్ గా కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే విడుదలైన ఫ్యామిలీ మాన్ 2 ట్రైలర్ లో సమంత  డీగ్లామర్  లుక్ లో భయపెట్టేదిగా ఉంది.
undefined
అలాగే సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే పాన్ ఇండియా మూవీకి సైన్ చేశారు.
undefined
ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ త్వరలో మొదలుకానుంది.
undefined
click me!