ఇక రేపు మధ్యాహ్నా 12 గంటలకు శాకుంతలం నుంచి ట్రైలర్ విడుదల కానుంది. ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శాకుంతలం ఒక పౌరాణిక సినిమా. గుణశేఖర్ రచన మరియు దర్శకత్వం వహించారు. శకుంతల పాత్రలో సమంత నటిస్తుండగా, దుష్యంత రాజుగా దేవ్ మోహన్ కనిపించనున్నారు. మోహన్ బాబు, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. శాకుంతలం ఫిబ్రవరి 17న పలు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.