కంటెంట్ ఢమాల్, సమంత లిప్ కిస్సులపైనే ఫోకస్.. బాబోయ్ ఇలా ట్రోల్ చేస్తున్నారేంటి

First Published | Nov 8, 2024, 12:57 PM IST

సమంత చివరగా ఖుషి చిత్రంలో నటించింది. ఈ మూవీ రిలీజ్ అయి ఏడాది పైనే అవుతోంది. కానీ సమంత నుంచి మరో చిత్రం రాలేదు. ఇంతవరకు ఆమె కొత్త తెలుగు చిత్రానికి సైన్ కూడా చేయలేదు. దీనితో సమంతని ఆమె ఫ్యాన్స్ బిగ్ స్క్రీన్ పై చాలా మిస్ అవుతున్నారు.

సమంత చివరగా ఖుషి చిత్రంలో నటించింది. ఈ మూవీ రిలీజ్ అయి ఏడాది పైనే అవుతోంది. కానీ సమంత నుంచి మరో చిత్రం రాలేదు. ఇంతవరకు ఆమె కొత్త తెలుగు చిత్రానికి సైన్ కూడా చేయలేదు. దీనితో సమంతని ఆమె ఫ్యాన్స్ బిగ్ స్క్రీన్ పై చాలా మిస్ అవుతున్నారు. తన ఫ్యాన్స్ నిరీక్షణని కాస్తైనా తెరదించుతూ సమంత వెబ్ సిరీస్ తో ముందుకు వచ్చింది. 

చాలా కాలంగా సమంత నటిస్తున్న సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఓటిటిలో రీసెంట్ గా విడుదలయింది. ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో అద్భుతమైన గుర్తింపు వచ్చినప్పటి నుంచి సమంత ఎక్కువగా యాక్షన్ చిత్రాలు, వెబ్ సిరీస్ లు చేస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలోనే సిటాడెల్ కూడా తెరకెక్కింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో మరోసారి సమంత ప్రాణం పెట్టి చేసింది. 

Also Read : సమంత, బాలయ్య, రవితేజ చిత్రాలకు దిక్కుమాలిన సెంటిమెంట్.. పాపం బతిమాలిన హీరోయిన్


యాక్షన్ సన్నివేశంలో సామ్ అదరగొట్టింది. కానీ కంటెంట్ ఆశించినంత బలంగా లేదు. దీనితో కొన్ని ఎపిసోడ్స్ తప్ప మిగిలినవి బోరింగ్ గా ఉన్నాయి అంటూ క్రిటిక్స్ తేల్చేస్తున్నారు. క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి సిటాడెల్ వెబ్ సిరీస్ కి నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో సమంత కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. వరుణ్ ధావన్ తో కలసి ఇంటిమేట్ సీన్స్ చేసింది. వరుణ్ ధావన్, సమంత మధ్య వచ్చే లిప్ కిస్ సన్నివేశాలు చాలా బోల్డ్ గా ఉన్నాయి. 

నెటిజన్లు ఈ సన్నివేశాలని ఒక రేంజ్ లో వైరల్ చేస్తున్నారు. సమంతని ట్రోల్ చేసేవాళ్ళు చేస్తుంటే.. మరికొందరు ఆమె పెర్ఫామెన్స్ ని ప్రశంసిస్తున్నారు. సమంత లిప్ కిస్సుల కారణంగా కంటెంట్ మరుగున పడిపోయింది. కంటెంట్ ని ఎవరూ పట్టించుకోవడం లేదు. కేవలం లిప్ కిస్సులని మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. 

సమంత ఆరోగ్య సమస్యల వల్ల సిటాడెల్ చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సమంత కష్టపడి ఈ సిరీస్ ని పూర్తి చేసింది. కానీ ఆమె కష్టం వృధా అయ్యేలా కేవలం లిప్ కిస్సులు మాత్రమే హైలైట్ అవుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రల్లో నటించగా.. కేకే మీనన్, సిమ్రాన్ కీలక పాత్రల్లో నటించారు. 

Latest Videos

click me!