తనకి ఇష్టమైన నటి సాయంతో హాఫ్ డేలో అద్భుతం చేసిన చిరంజీవి..ఆమెతో ఉన్న బాండింగ్ అలాంటిది..

First Published | Nov 8, 2024, 11:30 AM IST

మెగాస్టార్ చిరంజీవికి తన కెరీర్ లో కలసి వచ్చిన హీరోయిన్లు కొంతమంది ఉన్నారు. కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి ఎక్కువగా రాధికతో సినిమాలు చేశారు. దాదాపుగా వీళ్ళిద్దరూ కలసి నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. రాధికకి ఎప్పుడు అడిగినా తనకి ఇష్టమైన హీరో చిరంజీవి అని చెబుతూ ఉంటుంది.

మెగాస్టార్ చిరంజీవికి తన కెరీర్ లో కలసి వచ్చిన హీరోయిన్లు కొంతమంది ఉన్నారు. కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి ఎక్కువగా రాధికతో సినిమాలు చేశారు. దాదాపుగా వీళ్ళిద్దరూ కలసి నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. రాధికకి ఎప్పుడు అడిగినా తనకి ఇష్టమైన హీరో చిరంజీవి అని చెబుతూ ఉంటుంది. చిరంజీవికి కూడా రాధికా అంటే చాలా అభిమానం. ఆన్ స్క్రీన్ పై వీళ్లిద్దరి కెమిస్ట్రీ ఎంత అద్భుతంగా పండిందో.. రియల్ లైఫ్ లో కూడా అంతే స్నేహంగా ఉంటారు. 

Chiraneevi

వీళ్లిద్దరి మధ్య అన్యోన్యతకి, పర్ఫెక్ట్ బాండింగ్ కి ఉదాహరణగా నిలిచే అద్భుతమైన సంఘటన ఉంది. చిరంజీవి, రాధిక నటించిన బిగ్గెస్ట్ హిట్స్ లో అభిలాష చిత్రం ఒకటి. మరణ శిక్షని రద్దు చేయాలని ప్రయత్నిచే లాయర్ కథగా ఈ చిత్రం తెరకెక్కింది. కోందండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలోని సందె పొద్దులకాడ అనే సాంగ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచింది. 


ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి కలసి ఈ పాటని పాడారు. ఇప్పుడు ఉన్నంతగా అప్పట్లో సదుపాయాలు ఉండేవి కాదు. ఇప్పుడు సాంగ్ షూట్ అంటే కొరియోగ్రాఫర్, అసిస్టెంట్స్, రిహార్సల్స్ ఇలా పెద్ద హంగామా ఉంటుంది. అప్పట్లో కూడా కొరియోగ్రాఫర్లు ఉండేవారు. కానీ అన్నీ చక చకా జరిగిపోయేవి. కొన్నిసార్లు కొరియోగ్రాఫర్లు కూడా అందుబాటులో ఉండేవారు కాదు. సందె పొద్దుల కాడ సాంగ్ షూటింగ్ సమయంలో కొరియోగ్రాఫర్ అందుబాటులో లేరట. 

దీనితో మనమే కొరియోగ్రఫీ చేసుకుని షూటింగ్ ఫినిష్ చేద్దాం అని చిరంజీవి, రాధిక డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని రాధిక ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. చిరంజీవికి నాకు సింక్ బాగా కుదిరేది. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. రాధిక సాయంతో చిరంజీవి స్వయంగా కొరియోగ్రఫీ చేసి హాఫ్ డేలో సాంగ్ షూట్ ఫినిష్ చేశారట. ఈ పాటలో చిరంజీవి, రాధిక కెమిస్ట్రీ.. వీళ్ళిద్దరూ వేసిన స్టెప్పులు మెస్మరైజ్ చేసేలా ఉంటాయి. అందుకే ఈ పాట క్లాసిక్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది. 

కొరియోగ్రాఫర్ అందుబాటులో లేని చాలా సందర్భాల్లో చిరంజీవి స్వయంగా సాంగ్స్ కి డ్యాన్స్ కంపోజ్ చేసేవారు. ఇటీవల చిరంజీవి తన డ్యాన్స్ ప్రతిభకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 

Latest Videos

click me!