`హిట్‌` ఫ్రాంఛైజీలో సమంత.. ఐడియా మైండ్‌ బ్లోయింగ్‌.. స్టార్‌ హీరోయిన్‌ స్పందన ఇదే!

Published : Dec 02, 2022, 08:45 PM IST

మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్‌ `హిట్‌` సినిమా ఫ్రాంఛైజీ గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది. అయితే ఇందులో సమంత పేరు వినిపించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది.   

PREV
16
`హిట్‌` ఫ్రాంఛైజీలో సమంత.. ఐడియా మైండ్‌ బ్లోయింగ్‌.. స్టార్‌ హీరోయిన్‌ స్పందన ఇదే!

నాని-శైలేష్‌ కొలను(Nani) క్రియేట్‌ చేసిన `హిట్‌` (Hit Series)సిరీస్‌ మంచి ఆదరణతో సాగుతుంది. నేడు(శుక్రవారం) విడుదలైన `హిట్‌2`(Hit 2)కి మంచి ఆదరణ దక్కుతుంది. మొదటి పార్ట్ అంత లేకపోయినా భారీ అంచనాలు, అడ్వాన్స్ బుకింగ్‌ వంటివన్నీ ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ తీసుకొస్తాయి. వీకెండ్‌ వరకు తిరుగులేదు. మొత్తంగా హిట్‌ అకౌంట్‌లో పడబోతుంది. 

26

ఇదిలా ఉంటే `హిట్‌` సిరీస్‌ని ఏడు సినిమాలుగా `అవెంజర్‌` ఫ్రాంఛైజీ తరహాలో తీసుకురావాలని నాని, శైలేష్‌ ప్లాన్ చేస్తున్నారు. `హిట్‌3`ని కూడా అనౌన్స్ చేశారు. `హిట్‌2`లోనే మూడో పార్ట్ గురించి చెప్పేశారు. మూడో భాగంలో నాని హీరోగా నటిస్తారని వెల్లడించారు. అడివిశేష్‌ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారని ఆల్‌రెడీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఏడు సినిమాల్లో ఇంకా నలుగురు హీరోలు ఎవరు నటిస్తారు? ఎవరితో నటింప చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. 

36

అయితే నాని దీన్ని ఇండియా లెవల్‌లో సూపర్‌ హీరో సినిమాలా చేయాలనుకుంటున్న నేపథ్యంలో చివరి సినిమాలో ఏడుగురు హీరోలు దేశ వ్యాప్తంగా ఇన్వెస్టిగేషన్‌ చేసేలా ప్లాన్‌ చేశారని సమాచారం. మరి అప్పటి వరకు ఈ సిరీస్‌ కొనసాగుతుందా. మధ్యలో రిజల్ట్ తేడా కొడితే అన్ని పార్ట్ లు తీస్తారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో సంచలన అప్ డేట్‌ వచ్చింది. 

46

`హిట్‌` సిరీస్‌లో సమంత అనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో, సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సిరీస్‌లో హీరోయిన్‌ మెయిన్‌ లీడ్‌గా ఎందుకు తీసుకోకూడదని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించాడు. ఒకటి రెండు పార్ట్ ల్లో సమంత(Samantha) లాంటి హీరోయిన్‌తో మెయిన్‌ లీడ్‌గా చేస్తే బాగుంటుందని ఆ జర్నలిస్ట్ ట్వీట్‌ చేశాడు. దీనికి అడివిశేష్‌ స్పందించాడు. ఐడియా అదిరిపోయింది. మరి సమంత ఏమంటారని ప్రశ్నించారు. 
 

56

దీనికి సమంత స్పందించింది. ఏ చెడ్డ పోలీస్‌, వినడానికి సౌండ్‌ ఫన్నీగా ఉంది. హిట్‌ సూపర్‌ హిట్‌కి అభినందనలు. అడివిశేష్‌ మీ విషయంలో ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాను` అని పేర్కొంది సమంత. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా, ఇదొక క్రేజీ న్యూస్‌గా మారింది. ఐడియా వరకు అద్భుతంగా ఉండటంతో, నిజంగానే సమంతనే భాగమైతే సెన్సేషనల్‌ అవుతుందని చెప్పొచ్చు. ఫన్నీగా సాగిన చర్చ సీరియస్‌గా టర్న్ తీసుకుంటుందా? ఇంతటితో క్లోజ్‌ అవుతుందా అనేది చూడాలి. 

66

సమంత ఇటీవల లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం `యశోద` చిత్రంలో నటించింది. ఆమె పోలీస్‌గా నటించి ఆకట్టుకోవడమే కాదు, అదరగొట్టింది. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసి వాహ్‌ అనిపించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె `శాకుంతలం`, `ఖుషి` చిత్రాల్లో నటిస్తుంది. మరోవైపు `మయోసైటిస్‌` అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. దాన్నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది సమంత. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories