స్టార్ హీరోయిన్ సమంతకు సర్ ప్రైజ్.. హ్యాపీగా ఫీల్ అయిన సామ్.. పోస్ట్ వైరల్!

First Published | Feb 16, 2023, 12:20 PM IST

స్టార్ హీరోయిన్ సమంత (Samantha)ను తన క్లోజ్ ఫ్రెండ్ ఊహించని విధంగా సర్ ప్రైజ్ చేశారు. ఈ విషయాన్ని సామ్ స్వయంగా చెబుతూ సంతోషం వ్యక్తం చేసింది. ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎవరు.. ఎలా సర్ ప్రైజ్ చేశారంటే..
 

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తన మాజీ భర్త అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ప్రస్తుతం కేరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి సామ్ కాస్తా సమయమే పట్టింది.

చైతూకు దూరమయ్యాక సామ్ కు ఒకసమస్య తర్వాత మరో సమస్య వచ్చిపడుతూనే ఉంది. ఇటీవల మయోసైటిస్ కు గురైన చికిత్స పొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సమంత ఆరోగ్యం బాగానే ఉందని తెలుస్తోంది. 
 


రీసెంట్ గా తమిళనాడులోని పళని సుబ్రహ్మణ్యస్వామిని కూడా దర్శించుకున్నారు సమంత. తన ఆరోగ్యం బాగుంటే ప్రత్యేక పూజలు చేయిస్తానని మొక్కుకున్న ఈ బ్యూటీ.. తాజాగా మొక్కులు చెల్లించారు. మెట్టుమెట్టుకు దీపం పెట్టి భక్తిని చాటుకున్నారు. 
 

ప్రస్తుతం మళ్లీ సినిమాలకు సిద్ధం అవుతున్నారు. ప్రాక్టీస్ మొదలెట్టారు. జిమ్ లో నిత్యం కనిపిస్తూ ఎనర్జీని ఫిల్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ పోస్టులతోనూ ఆకట్టుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. 
 

ఈ క్రమంలో.. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సమంతను తన క్లోజ్ ఫ్రెండ్ ప్రియాంక దుగ్గి సర్ ప్రైజ్ చేసినట్టు తెలిపారు. తనకోసం రోజ్ ఫ్లవర్స్ పంపించి విష్ చేసినట్టు స్వయంగా వెల్లడించారు. గిఫ్ట్ కూడా అందించినట్టు తెలుస్తోంది. దీంతో తన ఫ్రెండ్ కు థ్యాంక్స్ చెబుతూ సామ్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ఇందుకు చాాలా ఖుషీ అయ్యారు. సామ్ పై తన ఫ్రెండ్ చూపించిన ప్రేమకు అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 

తాజాగా తను బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా ఓ స్టిల్ ఫొటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. చాలా పవర్ ఫుల్ లుక్ గా పంచ్ ఇస్తున్న పోజులో ఆకట్టుకున్నారు. సమంత ఎనర్జికి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తన సినిమాల కోసం ఇంతలా కష్టపడుతుండటంతో అభినందించారు. ప్రస్తుతం ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. 

Latest Videos

click me!