ఈ ట్రిప్ కి సంబంధించిన ఒక ఎమోషనల్ పోస్ట్ సమంత సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందమైన, సరదా, ఆనంద క్షణాల ఈ వారం ఎంతో వేగంగా గడిచిపోయాయి అంటూ పోస్ట్ పెట్టింది. అలాగే ఫ్లైట్ లో, డెహ్రాడూన్ లో శిల్పారెడ్డి తో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. సమంత ఫోటోలు చూసిన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.