నాగ చైతన్య ఎంగేజ్మెంట్ వేళ విడాకులకు కారణాలు బయటపెట్టిన సమంత ఫ్రెండ్, సంచలనంగా సోషల్ మీడియా పోస్ట్

First Published | Aug 9, 2024, 7:25 AM IST

నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ నేపథ్యంలో సమంత ఫ్రెండ్ చేసిన సోషల్ మీడియా కామెంట్స్ సంచలనం రేపుతున్నాడు. కంగ్రాట్స్ పతిత, ఇప్పుడు అతడు నీవాడు, అంటూ ప్రీతమ్ జుగల్కర్ ఘాటైన విమర్శలు చేశాడు. 
 

నాగ చైతన్య-సమంత విడాకులకు కారణాలు ఏమిటో తెలియదు. ఈ విషయంలో సమంత ఎక్కువగా నిందించబడింది. పెళ్లి చేసుకుని కూడా బోల్డ్ రోల్స్ చేయడం. ఆమె డ్రెస్సింగ్ కారణమయ్యాయని ఒక వాదన వినిపించింది. అలాగే ఆమెకు పిల్లలు కనడం ఇష్టం లేదని. కుటుంబ విలువలు పాటించడం లేదంటూ కథనాలు వెలువడ్డాయి.

సమంత ఎఫైర్ రూమర్స్ సైతం ఎదుర్కొంది. ఆమె పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ తో రిలేషన్ పెట్టుకుందని ఊహాగానాలు వినిపించాయి. సమంత-జుకల్కర్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నాగ చైతన్య ఫ్యాన్స్ ప్రీతమ్ ని టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో ప్రీతమ్ వివరణ ఇచ్చాడు. 


సమంత నాకు అక్కతో సమానం. మా బంధం ఏమిటో నాగ చైతన్యకు కూడా తెలుసు. అనవసరంగా నన్ను వివాదంలోకి లాగవద్దని ప్రీతమ్ వేడుకున్నాడు. ప్రీతమ్ తో ఎఫైర్ లో ఉందంటూ వార్తలు వచ్చినా సమంత పట్టించుకోలేదు. అతడితో తన స్నేహాన్ని కొనసాగిస్తోంది. కాగా నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల ఆగస్టు 8న నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈ క్రమంలో ప్రీతమ్ సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. 

ప్రీతమ్ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో.. శుభాకాంక్షలు పతిత, ఇప్పుడు అతడు నీ వాడు. రహస్యాలు, అబద్ధాలు బంధాలను నాశనం చేస్తాయి. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా దొరికిపోతారు, అని రాసుకొచ్చాడు. ఈ కామెంట్స్ నాగ చైతన్య, శోభితను ఉద్దేశించే అనే వాదన మొదలైంది. ప్రీతమ్ పరోక్షంగా శోభితపై ఘాటైన కామెంట్స్ చేశాడు.

Naga Chaitanya-Sobhita Dhulipala


ప్రీతమ్ కామెంట్స్ పరిశీలిస్తే అసలు సమంత-నాగ చైతన్య విడిపోవడానికి శోభితనే కారణం అనిపిస్తుంది. శోభితతో రిలేషన్ పెట్టుకున్న నాగ చైతన్య సమంతను మోసం చేశాడు. ఈ విషయం తెలిసి సమంత విడాకులు తీసుకుందని అర్థం వచ్చేలా ప్రీతమ్ కామెంట్స్ ఉన్నాయనే  చర్చ మొదలైంది. చూస్తుంటే సమంత-నాగ చైతన్య వైవాహిక జీవితంలో ఏం జరిగిందో ప్రీతమ్ కి తెలుసు. మొత్తంగా ప్రీతమ్ సోషల్ మీడియా పోస్ట్ ప్రకంపనలు రేపుతోంది. 
 

Latest Videos

click me!