పవన్ కళ్యాన్ అందుకే గ్రేట్.. హీరోయిన్ శ్రీయాఎందుకలా అన్నారు..?

First Published | Aug 8, 2024, 10:36 PM IST

పవర్ స్టార్  పవన్‌ కల్యాణ్‌ ను ఆకాశంలోకి ఎత్తింది.. ప్రముఖ హీరోయిన్ శ్రియా శరణ్. పవర్ స్టార్  రాబోయే రోజుల్లో అద్భుతాలు సృష్టిస్తారని  అంటోంది.

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవర్ స్టార్  పవన్‌ కల్యాణ్‌ ను ఆకాశంలోకి ఎత్తింది.. ప్రముఖ హీరోయిన్ శ్రియా శరణ్. పవర్ స్టార్  రాబోయే రోజుల్లో అద్భుతాలు సృష్టిస్తారని ఆమె వ్యాఖ్యలు చేసింది. గతంలో పవన్‌తో కలిసి ఈమె బాలు అనే సినిమాలో హీరోయిన్‌గా చేసింది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్ లో శ్రీయా ఈ వాఖ్యలు చేశారు. 
 

ఓ షాపింగ్‌మాల్‌ ఓపెనింగ్ లో  పాల్గొంది  శ్రియా శరణ్.  పవర్‌స్టార్‌ను ఈ సందర్భంగా ఆమె ఆకాశానికెత్తేసింది. పవర్ కళ్యాణ్ తో చేసింది ఒక్క సినిమానే అయినా.. ఆయన గురించి శ్రియా చాలా చెప్పింది. శ్రియా మాట్లాడుతూప.. రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో పవన్‌కల్యాణ్‌ అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఆయనను చూసి నేను ఎంతో గర్విస్తున్నా. మేమిద్దరం గతంలో బాలు అనే సినిమా కోసం కలిసి పని చేశాం. సినిమాల విషయంలోనే కాదు.. ఇతర విషయాల్లో కూడా ఆయన మార్క్ అద్భుతంగా ఉంటుంది అన్నారు. 


ఇక పవన్ కళ్యాణ్ షూటింగ్ సెట్ లో చాలా సైలెంట్‌గా ఉంటారు. ఆయనకు కష్టపడే  మనస్తత్వం ఎక్కువ. చాలా మంచి వ్యక్తి. ఎదుటివారిని ఇబ్బందిపెట్టే పని ఆయన చేరు అని అన్నారు శ్రియా. ఇక బాలు సినిమాలో ఓ పాట షూటింగ్ చేస్తున్న టైమ్ లో జరిగిన ఓ సంఘటన గురించి శ్రియ వివరించారు. బాలుషూటింగ్ లో  ఆయన కాలికి గాయమైంది. కాని ఆ పాట షూట్‌ పూర్తయ్యేవరకూ ఆ విషయాన్ని ఎవరితోనూ ఆయన చెప్పలేదు అని అన్నారు శ్రియా. 
 

ఎవరు తన వల్ల ఇబ్బంది పడకూడదు అని ఆలోచించే వ్యక్తి  పవన్ కళ్యాణ్. అందుకే ఆయన ప్రజలకు మంచి చేయాలని తపన ఉన్న మనిషి.  ప్రజలు ఆయన్ని ఎన్నుకోవడం ఎంతో మంచి విషయం.. పవర్ స్టార్ డిప్యూటీ సీఎం అవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన అద్భుతాలు సృష్టిస్తారని నేను నమ్ముతున్నా అని శ్రియ తెలిపారు. అలాగే చిరంజీవితో కలిసి మరోసారి పని చేయాలనుకుంటున్నానని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు శ్రియా. 

Latest Videos

click me!