స్విమ్మింగ్ పూల్ లో సమంత హొయలు.. ఖుషి రిలీజ్ కి ముందు చిల్ అవుతున్న సామ్

Published : Sep 01, 2023, 06:39 AM IST

ఖుషి చిత్రం పూర్తి చేశాక సమంత సినిమాల నుంచి ఏడాది సమయం బ్రేక్ తీసుకుంది. ఆరోగ్యం కుదుటపడేవరకు ఏ చిత్రానికి అంగీకరించకూడదని సామ్ నిర్ణయించుకుంది.

PREV
17
స్విమ్మింగ్ పూల్ లో సమంత హొయలు.. ఖుషి రిలీజ్ కి ముందు చిల్ అవుతున్న సామ్

ఏడాది కాలంగా సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. సమంత మయోసైటిస్ వ్యాధికి గురైంది. విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుని కాస్త కోలుకుంది. చకచకా యశోద, శాకుంతలం చిత్రాలు పూర్తి చేసిన సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషి చిత్రం నేడు రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ ప్రీమియర్ షోల నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడం విశేషం. 

27

మంచి బజ్ సొంతం చేసుకున్న ఖుషి చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఇదిలా ఉండగా సమంతని మయోసైటిస్ వ్యాధి ఏడాది నుంచి వేధిస్తోంది. ఆ మధ్యన యుఎస్ లో సమంత చికిత్స తీసుకుంది. అయితే పూర్తిగా వ్యాధి నయం కాలేదు. దీనితో సమంత ట్రీట్మెంట్ తీసుకుంటూనే యోగా లాంటి సహజసిద్ధమైన పద్ధతులు పాటిస్తోంది. 

37

ఖుషి చిత్రం పూర్తి చేశాక సమంత సినిమాల నుంచి ఏడాది సమయం బ్రేక్ తీసుకుంది. ఆరోగ్యం కుదుటపడేవరకు ఏ చిత్రానికి అంగీకరించకూడదని సామ్ నిర్ణయించుకుంది. ఇదిలా ఉండగా సమంత ఇటీవల తన తల్లితో కలసి చికిత్స కోసం న్యూయార్క్ వెళ్ళింది. కొంతకాలం అక్కడే ఉంది సామ్ ట్రీట్మెంట్ తీసుకోనుంది. 

47

అయితే సమంత నెటిజన్లకు చిన్న షాక్ ఇచ్చింది. న్యూయార్క్ వెళ్ళగానే ఎంజాయ్ మూడ్ లోకి వెళ్ళిపోయింది సామ్. తన ఫ్రెండ్స్ తో కలసి సిటీ మొత్తం చక్కర్లు కొడుతోంది. చికిత్స అన్ని సమయాల్లో ఉండదు కాబట్టి సామ్ ఇలా ఎంజాయ్ చేస్తోంది అని అంటున్నారు. 

57

తన స్నేహితులతో కలసి జిమ్ లో, రెస్టారెంట్స్ లో.. అందమైన ప్రదేశాల్లో సామ్ చక్కర్లు కొడుతోంది. తాజాగా సమంత అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తున్న ఫొటోస్ కూడా షేర్ చేసింది. అలాగే స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలని కూడా పోస్ట్ చేసింది. 

67

సమంత క్రేజీ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఖుషి ప్రమోషన్స్ కి డుమ్మా కొట్టి యుఎస్ లో సామ్ చేస్తోంది ఇదా అని పెదవి విరుస్తున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు. 

 

77

ఇక సమంత ఇటీవల న్యూయార్క్ లో భారతీయులు నిర్వహించిన ఇండియన్స్ ఇండిపెండెన్స్ పెరేడ్ కార్యక్రమంలో కూడా పాల్గొంది. చాలా హుషారుగా సమంత ర్యాలీలో పాల్గొని ఆకట్టుకుంది. 

click me!

Recommended Stories