విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో రూపొందిన ఖుషీ మూవీ ఈ రోజు రిలీజ్ అవుతోంది. ఇప్పటికే యుఎస్ లో ప్రివ్యూలు పడిపోయాయి. సినిమాకు మంచి టాక్ నడుస్తోంది. నానితో చేసిన టక్ జగదీష్ సినిమా డిజాస్టర్ తరువాత శివ నిర్వాణ.. ‘ఖుషి’ చేసేందుకు ఫ్లాప్స్‌లో ఉన్న అటు సమంత, విజయ్ దేవరకొండల్ని ఒప్పించారు. అంతకు ముందు నిన్నుకోరి, మజిలీ వంటి హిట్ చిత్రాలను తీశారు శివ నిర్వాణ రొమాంటిక్ గా నడిచే ఎమోషన్ సీన్స్ ని బాగా డీల్ చేస్తాడని పేరు తెచ్చుకున్నారు. దాంతో సినిమాపై మంచి బజ్ ఉంది.