kushi Review: ఖుషీ మూవీ ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ అనుకున్నది సాధించాడా..?

First Published | Sep 1, 2023, 3:22 AM IST

విజయ్ దేవరకొండ, సమంత జంటగా.. ప్రేమ కథలను మత్తులా ఆడియన్స్ కు ఎక్కించే దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఖుషి. ఈ మూవీ ఈరోజు అనగా సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుండగా... ప్రీమియర్స్ సందడి స్టార్ట్ అయ్యింది. మరి సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారో చూద్దాం. 
 

ఇప్పటికే ఈసినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవ్వగా.. మ్యూజిక్ ఈవెంట్ లో సమంతతో కలిసి రొమాంటిక్ డాన్స్ చేసి..మరింతి హీటు పెంచాడు విజయ్ దేవరకొండ.. ఈసినిమాకు తన మార్క్ ప్రమోషన్లు చేశాడు. వరుసగాప్లాప్ లతో ఇబ్బందిపడుతున్న విజయ్ దేవరకొండకు.. శాకుంతలంతో ఫెయిల్యూర్ ను ఫేస్ చేసిన సమంతకు, టక్ జగదీష్ తో దెబ్బతిన్న శివనిర్వాణ.. ఈ ముగ్గురికి  ఖషి సక్సెస్ చాలా ఇంపార్టెంట్. మరి సినిమా చూసిన వాళ్లు ఏం చెపుతున్నారంటే..? 

ఈసినిమా కథ కశ్మీర్ లో మొదలవుతుంది. బేగం పేరుతో పిలవబడుతున్న ఆరాధ్యను (సమంత)ని చూసి ఇది నా పిల్ల అని ఫిక్స్ అయిపోతాడు విప్లవ్ (విజయ్ దేవరకొండ). తొలిచూపులోనే ప్రేమలో పడతాడు విప్లవ్‌‌. అనూహ్య పరిస్థితుల్లో బ్రహ్మిణ్ అని తెలిసి.. పెద్దలను ఒప్పించే పనిలో పడతాడు.. కాని విప్లవ్ క్రిష్టియన్ అబ్బాయి కావడం.. ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో.. తమ జంట ప్రపంచంలోనే లేనంత గొప్పదని నిరూపించడం కోసం.. పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసుకుంటారు ఇద్దరు. ఆతరువాత జరిగిన పరిణామాల కథే ఈ ఖుషి. 


ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంది అంటున్నారు ట్విట్టర్ జనాలు. మంచి కథ, సమయానికి తగినట్టు పాటలతో.. డీసెంట్ గా వెళ్లిదంటూ.. ట్వీట్ చేస్తున్నారు.  ఫస్ట్ పార్ట్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. సెకండ్ హాఫ్ ఎలా ఉటుందో అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఆడియన్స్. 

హిట్టు బొమ్మ.. డీసెంట్ హిట్ కొట్టారు అంటున్నారు నెటిజన్లు.  విజయ్ దేవరకొండ, సమంత తమ నటనతో పిచ్చెక్కించారు.. ఇద్దరుపెయిర్ బాగున్నాయి. సినిమా పాటు, బీజియం నెక్ట్స్ లెవల్..  మంచి కథకు.. అద్భుతమైన సినిమాటోగ్రఫీ తోడైయ్యింది అంటే కామెంట్స్ చేస్తున్నారు ట్విట్టర్ జనాలు. చాలా మందికి ఖుషి పిచ్చి పిచ్చిగా నచ్చినట్టుంది. 

విజయ్ ఫ్యాస్స్ నానీ సినిమాలో సీన్ ను ఎక్కువగా ట్విట్టర్ లో శేర్ చేస్తున్నారు. గీత గోవిందం తరువాత సాలిడ్ హిట్ లేక..ఒక రకంగా చెప్పాలంటే.. అసలు హిట్ సినిమా  లేక విజయ్ టార్చర్ అనుభవిస్తున్నాడు. ఈసినిమాతో సైలెంట్ హిట్ కొట్టాడని.. చెప్పడానికి సింబాలిక్ గా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఫ్యాన్స్. 

మరికొంత మంది మాత్ర  ఒక్క సారి వీకెండ్ లో చూడదగ్గ సినిమా ఖుషీ అంటున్నారు. మేము చూశాము..మీరు కూడా చూడండి.. రివ్యూస్ గురించి పట్టించుకోవద్దూ అంటూ కామెంట్ పెడుతున్నారు. ఖుషీ సినిమా గురించ ఏం చెప్పకుండానే.. ఒక్క సారి చూడదగ్గ సినిమా అంటూ తేల్చేస్తున్నారు.. కొంత మంది ట్విట్టర్ జనాలు. 

Kushi Samantha Vijay Deverakonda

ఇక ఈసినిమాలో పెద్దగా మైనస్ పాయింట్స్ఏమీ వినిపంచడంలేదు.. ముఖ్యంగా విజయ్ తో పాటు సమంత నటనకు ఫిదా అయిపోతున్నారు ఆడియన్స్. ఇద్దరి జంట ఆన్ స్క్రీన్ అద్భుతంగా ఉన్నారంటూ కమెంట్స్ పెడుతున్నారు. ఈమధ్య మ్యూజిక్ ఈవెంట్ లో కూడా..స్టేజ్ పైనే ఇద్దరి రొమాంటిక్ పెర్ఫామెన్స్ చూశాం... ఈ విషయంలో విమర్షలు కూడా ఎదుర్కొన్నారు జంట. 

అంతే కాదు చాలా వరకూ విజయ్ దేవరకొండ సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాదు.. కంగ్రాట్స్ విజయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. హిట్టుకోసం ఎదరుచూస్తున్న విజయ్.. ఒక దశలో.. ప్రేమ కథలు చేయనన్నాడు.. కాని విజయ్ ను ఒప్పించి.. పక్కా లవ్ స్టోరీతో శివ నిర్వాణ సినిమా చేశాడు. ఇక ఈసినిమా  హిట్టు టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మరి రిలీజ్ తరువాత ఆడియన్స్ ఎలాంటిరిజల్ట్ ఇస్తారో చూడాలి. 

Latest Videos

click me!