'సింపతీ క్వీన్' అంటూ సమంతకి బిరుదు.. నేను రాకపోతే ఆ సినిమా పోతుంది, అందుకే అలా చేశా

Published : Mar 16, 2024, 04:37 PM IST

మంతకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో నెగిటివిటి కూడా అంతే స్థాయిలో ఉంది. నాగ చైతన్యతో విడిపోయినప్పటి నుంచి సమంత ట్రోలింగ్ ఎదుర్కొంటోంది.

PREV
17
'సింపతీ క్వీన్' అంటూ సమంతకి బిరుదు.. నేను రాకపోతే ఆ సినిమా పోతుంది, అందుకే అలా చేశా

స్టార్ బ్యూటీ సమంత చివరగా ఖుషి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండతో కలసి బ్యూటిఫుల్ కెమిస్ట్రీ పండించింది. అయితే పూర్తి స్థాయిలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. 

27

ఏడాది కాలంగా సమంత మయోసైటిస్ వ్యాధితో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ కారణంగా సమంత పూర్తిస్థాయిలో సినిమాలకు సమయం కేటాయించలేక పోతోంది.  దీనితో సమంత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది క్లారిటీ లేదు. 

37

అయితే ఇటీవల ఎక్కువగా ఆధ్యాతిక ప్రాంతాల్లో సందర్శిస్తూ యోగ, పూజలు చేస్తోంది. తన ఆరోగ్యం కుదుటపడడం కోసం సమంత చేయని ప్రయత్నం అంటూ లేదు. మెడికల్, యోగ, ఫిట్ నెస్ ట్రైనింగ్ ఇలా సమంత అన్ని రకాలుగా తిరిగి పంజుకునేందుకు ప్రయత్నిస్తోంది.అయితే ఇటీవల సమంత మయోసైటిస్, దాని ప్రభావం నుంచి పూర్తిగా బయట పడ్డట్లు తెలుస్తోంది.    

47

దీనితో సమంత తదుపరి చిత్రాలకు రెడీ అవుతోంది. సమంతకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో నెగిటివిటి కూడా అంతే స్థాయిలో ఉంది. నాగ చైతన్యతో విడిపోయినప్పటి నుంచి సమంత ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. సమంత గత ఏడాది పౌరాణిక చిత్రం శాకుంతలంలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. 

57

ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో సమంత ని బాగా ట్రోల్ చేశారు. ఆ సమయంలో ట్రోలర్స్ సమంతకి సింపతీ క్వీన్ అనే బిరుదు కూడా ఇచ్చారు. ఈ ట్రోలింగ్ పై తాజాగా సమంత ఓ కార్యక్రమంలో స్పందించింది. తనని ట్రోల్ చేస్తూ సింపతీ క్వీన్ అని బిరుదు ఇచ్చారని తన దృష్టికి వచ్చినట్లు సామ్ పేర్కొంది. 

67

శాకుంతలం చిత్ర రిలీజ్ టైంలో నా వ్యాధి గురించి ఇంటర్వ్యూలో చెప్పాను. దీనితో అంతా సింపతీ కోసం అనుకున్నారు. ఆ చిత్రానికి నేను తప్పనిసరిగా ప్రమోషన్స్ చేయాల్సిన పరిస్థితి. లేకుంటే సినిమా చచ్చిపోతుంది అని భావించి మీడియా ముందుకు వచ్చాను. అప్పటికి నా ఆరోగ్యం సరిగ్గా లేదు. నీరసంగా అనిపించింది. అందుకే నా వ్యాధి గురించి చెప్పాను. 

77

తాను ఆ సమయంలో అలా ప్రవర్తించడం చాలా మందికి అర్థం కాలేదు. నా వ్యాధి గురించి వాళ్ళకి తెలియదు. అందులో ట్రోల్ చేసారు అంటూ సమంత సాఫ్ట్ గా రియాక్ట్ అయింది. ఏది ఏమైనా ఆ చిత్రం మాత్రం నిరాశపరిచింది. కానీ సమంత నటనకి ప్రశంసలు దక్కాయి. 

click me!

Recommended Stories