సైలెంట్ గా ఉండమని నిహారిక మాజీ భర్త ఎవరికి చెబుతున్నాడు.. లేటెస్ట్ పోస్ట్ పై నెట్టింట చర్చ

Published : Mar 16, 2024, 03:16 PM ISTUpdated : Mar 16, 2024, 03:23 PM IST

పలు ఇంటర్వ్యూలలో నిహారిక ధైర్యంగా తన అభిప్రాయాలు చెబుతోంది. విడాకుల తర్వాత తన కుటుంబ సభ్యులు ఎలా సపోర్ట్ చేస్తున్నారు లాంటి విషయాలన్నీ నిహారిక వివరిస్తోంది. 

PREV
16
సైలెంట్ గా ఉండమని నిహారిక మాజీ భర్త ఎవరికి చెబుతున్నాడు.. లేటెస్ట్ పోస్ట్ పై నెట్టింట చర్చ

మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక నటిగా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. పెళ్ళికి ముందు కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది.  అయితే ఆ చిత్రాలు వర్కౌట్ కాలేదు. దీనితో నిహారిక ప్రస్తుతం వెబ్ సిరీస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.  అలాగే సినిమా ఆఫర్స్ కోసం కూడా ట్రై చేస్తోంది. 

26

తన పర్సనల్ లైఫ్ విషయాలతో నిహారిక తరచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మాజీ భర్త చైతన్య నుంచి నిహారిక విడాకులు తీసుకుంది. విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. అప్పటికి నుంచి నిహారిక సోషల్ మీడియాలో నెగిటివిటి ఎదుర్కొంటోంది.

36

నెగిటివిటి ఉన్నంత మాత్రాన నిహారిక సైలెంట్ గా ఉండడం లేదు. పలు ఇంటర్వ్యూలలో నిహారిక ధైర్యంగా తన అభిప్రాయాలు చెబుతోంది. విడాకుల తర్వాత తన కుటుంబ సభ్యులు ఎలా సపోర్ట్ చేస్తున్నారు లాంటి విషయాలన్నీ నిహారిక వివరిస్తోంది. 

 

46

మరోవైపు ఆమె మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ మాత్రం సైలెంట్ గా ఉంటున్నాడు. అయితే తాజాగా చైతన్య జొన్నలగడ్డ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కొత్త చర్చకి దారి తీస్తోంది. ఈ పోస్ట్ లో చైతన్య ఎవరికోసైలెంట్ గా ఉండడం వల్ల కలిగే ఉపయోగాలు వివరిస్తునట్లు ఉంది. 

56

విశాల అంతరిక్షంలో ఉన్న నిశ్శబ్దం, నీటి అడుగున ఉన్న నిశ్శబ్దం, మీ హృదయాన్ని బద్దలు కొట్టే విషయాన్ని విన్నప్పుడు వచ్చే నిశ్శబ్దం.. ఇలా ప్రతి నిశ్శబ్దం మీ ప్రాణ శక్తిని ప్రకృతి శక్తి నుంచి వేరు చేస్తున్నారు. మౌనం భగవంతుడితో ఏకం అయ్యే మాధ్యమం అంటూ చైతన్య వేదాంతం చెప్పుకొచ్చాడు.    

66

చైతన్య ఇలా నిశ్శబ్దం గురించి ఎవరికైనా పరోక్షంగా చెప్పదలుచుకున్నాడా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 2020లో వివాహం చేసుకున్న నిహారిక, చైతన్య విభేదాల కారణంగా గత ఏడాది విడిపోయారు. 

click me!

Recommended Stories