పవన్ కళ్యాణ్ హీరోయిన్ కృతి కర్బందా (Kriti Kharbanda) తాజాగా పెళ్లిపీటలు ఎక్కింది. ఆ మధ్యలో నిశితార్థం పూర్తవ్వగా... ఇవ్వాళ గ్రాండ్ గా వెడ్డింగ్ జరిగింది.
ఢిల్లీ బ్యూటీ, నటి కృతి కర్బందా బాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ చిత్రం ‘బోణీ’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
26
తొలినాళ్లలో సౌత్ చిత్రాల్లో బాగా మెరిసింది. తెలుగుతోపాటు దక్షిణాదిలోని ఆయా భాషల చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యే ప్రయత్నం చేసింది.
36
తెలుగులో ఈ ముద్దుగుమ్మ నాని ‘అలా మొదలైంది’, పవర్ స్టార్ వపన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘తీన్ మార్’, మనోజ్ ‘మిస్టర్ నూకయ్య’, ‘ఒంగోలు గిత్త’, ‘ఓం 3డీ’ వంటి చిత్రాల్లో నటించింది.
46
చివరిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’లోనూ నటించి మెప్పించింది. కానీ తెలుగు ప్రేక్షకులల్లో పెద్ద ఎత్తున గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కానీ బాలీవుడ్ లో మాత్రం ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది.
56
ఇదిలా ఉంటే.. కృతి కర్బందా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తన ప్రియుడు పుల్కిత్ సామ్రాట్ Pulkit Samrat ను తాజాగా పెళ్లి చేసుకుంది. గ్రాండ్ గా వివాహా వేడుక జరిగింది.
66
ఈ సందర్భంగా నూతన వధూవరుల ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో కృతి కర్బాందాకు సోషల్ మీడియాలో సెలబ్రెటీలు, ఫ్యాన్స్, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వెడ్డింగ్ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.