నిర్మాత విషం చిమ్ముతున్నాడంటూ బిపాసా పోస్ట్, అసలేం జరిగింది?

Published : Mar 04, 2025, 08:45 AM IST

Bipasha Basu  : విషపూరితమైన స్వభావం కలిగిన వ్యక్తులు అల్లర్లు సృష్టిస్తారు. తప్పు ఏదైనా సరే నిందలు మాత్రం ఎదుటి వ్యక్తుల మీదే వేస్తారు. ఆ తప్పునకు బాధ్యత మత్రం వహించరు. సింగర్ మికా సింగ్‌ ఆరోపణల నేపథ్యంలో నటి బిపాసా బసు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.  ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

PREV
13
 నిర్మాత విషం చిమ్ముతున్నాడంటూ బిపాసా పోస్ట్, అసలేం జరిగింది?
Bipasha Basu drops cryptic post on toxicity after Mika Singh accuses her in telugu


 Bipasha Basu  :  బాలీవుడ్‌ నటి బిపాసా బసు (Bipasha Basu), ఆమె భర్త కరణ్‌ సింగ్ గ్రోవర్‌పై సింగర్‌ మికా సింగ్‌ (Mika Singh) మధ్య వివాదం పెరిగిపోతోంది. బిపాసాపై ఇప్పటికే అనేక సార్లు  తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

ఈ దంపతుల వల్ల తాను ఆర్థికంగా ఎంతో నష్టపోయానని పలు ఇంటర్వ్యూల్లో ఆవేదన వ్యక్తంచేశారు. ఈనేపథ్యంలోనే తాజాగా బిపాసా బసు షేర్‌ చేసిన సోషల్‌మీడియా పోస్ట్‌ సోషల్ మీడియాలో  వైరల్‌గా మారింది. విషపూరితమైన వ్యక్తులకు దూరంగా ఉండాలంటూ అందులో రాసి ఉండటం చర్చనీయాశంగా మారింది.
 

23
Bipasha Basu


‘‘విషపూరితమైన స్వభావం కలిగిన వ్యక్తులు అల్లర్లు సృష్టిస్తారు. తప్పు ఏదైనా సరే నిందలు మాత్రం ఎదుటి వ్యక్తుల మీదే వేస్తారు. ఆ తప్పునకు బాధ్యత మత్రం వహించరు. అలాంటి వ్యక్తులకు ఎప్పుడూ దూరంగా ఉండాలి.

ఆ భగవంతుడి ఆశీస్సులు అందరిపైనా ఉండాలి’’ అని రాసి ఉన్న ఒక సందేశాత్మక పోస్ట్‌ను బిపాసా తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేశారు. సింగర్‌ వ్యాఖ్యలను తిప్పుకొట్టేందుకే పరోక్షంగా ఆమె ఈ పోస్ట్‌ పెట్టి ఉంటారని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు.
 

33
Bipasha Basu


గొడవకు కారణం  ..

‘బిపాసా బసు, కరణ్‌ గ్రోవర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘డేంజరస్‌’ వెబ్‌ సిరీస్‌కు మికా సింగ్‌ నిర్మాతగా వ్యవహరించాడు. ఆ సిరీస్‌ను రూ.4 కోట్లలో చిత్రీకరించాలని బడ్జెట్‌ పెట్టుకుంటే, బిపాసా దంపతుల వల్ల రూ.14 కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సివచ్చిందంటారు  మికా సింగ్‌ తెలిపారు.

 ఆ సిరీస్‌ షూట్‌ కోసం లండన్‌కు వెళ్లినప్పుడు బిపాసా దంపతులు నాటకాలు ఆడారని, షూట్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించేవారు కాదని ఆయన ఆరోపించారు. వారి వల్లనే రూ.4 కోట్ల బడ్జెట్‌ కాస్త రూ.14 కోట్లు అయిందన్నారు.

వారి ప్రవర్తన చూశాక నిర్మాతగా మారినందుకు ఎంతో బాధపడ్డానని చెప్పారు. ‘వాళ్లు నాడు నాకు చేసిన నష్టానికే ఈనాడు ఆ దంపతులకు ఏ పనీ లేకుండా పోయింది’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
 
 

Read more Photos on
click me!

Recommended Stories