Samantha Cine Journey Celebrations: `యశోద` సెట్‌లో సమంత 12ఏళ్ల సినీ జర్నీ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

Published : Feb 26, 2022, 09:40 PM IST

స్టార్‌ హీరోయిన్‌ సమంత తన 12ఏళ్ల సినీ జర్నీని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం `యశోద` మూవీ సెట్‌లో సమంత జర్నీని సెలబ్రేట్‌ చేశారు. ప్రస్తుతం ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 

PREV
15
Samantha Cine Journey Celebrations: `యశోద` సెట్‌లో సమంత 12ఏళ్ల సినీ జర్నీ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

సమంత ప్రస్తుతం `యశోద` చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్‌ సెట్‌లోనే సమంత 12ఏళ్ల జర్నీకి సంబంధించిన సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇందులో నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌, దర్శకుడు హరి శంకర్‌, ఇతర చిత్ర టీమ్‌ పాల్గొంది. సమంత చేత కేక్‌ కట్‌ చేయించి ఆమెకి శుభాకాంక్షలు తెలియజేశారు.

Samantha 12 yrs Cinema Jurney Celebrations 

25

పన్నేండేళ్లు సినీ కెరీర్‌ని సమంత పూర్తి చేసుకోవడం మామూలు విషయం కాదు. ఆమె సినీ జర్నీలో ఎన్నో ఆటుపోట్లున్నాయి. ఆద్యంతం ఎమోషనల్‌గా సాగే ఆమె జర్నీ నేటి తరానికి స్ఫూర్తివంతమని చెప్పొచ్చు. సినిమాల్లోకి రాకముందు డబ్బు కోసం ఇబ్బంది పడ్డ సమంత ఏకంగా ఫంక్షన్లు, ఈవెంట్లలో వెల్‌కమ్‌ గర్ల్ గానూ పనిచేసింది. అందుకోసం ఆమె రోజుకి ఐదు వందల రూపాయలు అందుకునేదట. డబ్బులు లేకపోవడంతో చదువు కూడా మధ్యలోనే మానేసినట్టు చెప్పింది సమంత. 
 

35

`ఏమాయ చేశావే` సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సమంత చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నేటికి 12 ఏళ్లు పూర్తి కావొస్తుంది. గౌతమ్‌మీనన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే సమంత తెరంగేట్రం చేసింది. ఇందులో ఆమె నాగచైతన్యతో కలిసి నటించింది. ఈ చిత్రం విడుదలైన నేటికి 12ఏళ్లు. ఈ సందర్భంగా తన సినీ జర్నీని తెలియజేస్తూ సామ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ను షేర్‌ చేసుకుంది.

45

 'చిత్ర పరిశ్రమలో నటిగా నా ప్రయాణం మొదలై నేటికి 12 సంవత్సరాలు.లైట్స్‌, కెమెరా, యాక్షన్‌.. వీటి చుట్టూ నాకున్న మధుర ఙ్ఞాపకాలు, అద్భుతమైన అనుభూతులకు 12 ఏళ్లు. ఇన్నేళ్ల ప్రయాణంలో ప్రపంచ వ్యాప్తంగా నిస్వార్థమైన అభిమానులను పొందినందుకు ఆనందంగా ఉంది. సినిమాపై నాకున్న ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా' అంటూ సమంత పేర్కొంది. సమంత నటించిన తొలి చిత్రం హీరో నాగచైతన్యనే ప్రేమించి పెళ్లి చేసుకుంది సమంత. సరిగ్గా నాలుగేండ్ల తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సింగిల్ గానే ఉన్న సమంత సినిమా కెరీర్‌పై ఫోకస్‌ పెట్టింది. 
 

55

అందులో భాగంగా `యశోద` చిత్రంలో సమంత మెయిన్‌ లీడ్‌గా నటిస్తుండగా, హరి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తుండటం విశేషం. దీంతోపాటు తెలుగులో `శాకుంతలం` చిత్రంలో శకుంతలగా నటిస్తుంది. మరోవైపు ఓ అంతర్జాతీయ ప్రాజెక్ట్ ని, ఓ తమిళ చిత్రంలో నటిస్తుంది. బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెడుతున్నట్టు సమాచారం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories