BiggBoss Telugu OTT: అరియానా, అషురెడ్డి, నటరాజ్‌ మాస్టర్‌, ముమైత్‌ ఖాన్‌.. ఓటీటీ బిగ్‌బాస్‌ షోలో పాత వారు రచ్చ

Published : Feb 26, 2022, 07:49 PM ISTUpdated : Feb 26, 2022, 09:01 PM IST

తెలుగు టీవీ రియాలిటీ షో బిగ్‌బాస్‌ తెలుగు ఓటీటీ ఆరవ సీజన్‌ శనివారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఈ షో ప్రసారమవుతుంది. ఈ సీజన్‌లో గత బిగ్‌బాస్‌ సీజన్లలో పాల్గొన్న వారు సందడి చేయబోతుండటం విశేషం.   

PREV
111
BiggBoss Telugu OTT: అరియానా, అషురెడ్డి, నటరాజ్‌ మాస్టర్‌, ముమైత్‌ ఖాన్‌.. ఓటీటీ బిగ్‌బాస్‌ షోలో పాత వారు రచ్చ

బిగ్‌బాస్‌ తెలుగు ఓటీటీ(Bigg Boss Telugu OTT)లో సగం మంది పాత కంటెస్టెంట్లు సందడి చేయబోతున్నారు. వారిలో అరియానా, అషురెడ్డి, ముమైత్‌ ఖాన్‌, మహేష్‌ విట్టా, నటరాజ్‌ మాస్టర్‌ ఉన్నారు. ప్రస్తుతం వీరు గ్రాండ్‌ ఎంట్రీతో ఆడియెన్స్ ని కనువిందు చేస్తున్నారు. వీరంతా వారియర్స్ టీమ్‌ గా హౌజ్‌లోకి వస్తుండటం విశేషం. అయితే ఈ సారి బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్లని రెండు టీమ్‌లుగా విభజించారు. వీరిలో పాతవారిని వారియర్స్ గా, కొత్త వారిని ఛాలెంజర్స్ గా విభజించారు. 

211

వారియర్స్ టీమ్‌ నుంచి `బిగ్‌బాస్‌ తెలుగు ఓటీటీ`లోకి మొదటి కంటెస్టెంట్ గా అషురెడ్డి(Ashu Redy) ఎంట్రీ ఇచ్చారు. తనదైన ఆటాపాటతో, గ్లామరస్‌తో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వడం విశేషం. 

311

బిగ్‌బాస్‌ తెలుగు ఓటీటీ ఆరవ సీజన్‌కి సంబంధించి రెండో కంటెస్టెంట్‌గా మహేష్‌ విట్టా ఎంట్రీ ఇచ్చారు. తనదైన కమెడీతో ఎంటర్‌టైన్‌ చేసే మహేష్‌ ఈసారి కూడా వినోదం పంచబోతున్నారు. 

411

మూడవ కంటెస్టెంట్‌గా ఐటెమ్‌ సాంగ్‌లకు ఫేమస్‌ అయిన ముమైత్‌ ఖాన్‌(Mumaith Khan) ఎంట్రీ ఇవ్వడం విశేషం. మాస్‌ ఎంట్రీతో రచ్చ చేసింది. ఆమె లుక్‌ ఆకట్టుకుంటుంది.

511

ఇక ఏడో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో టాప్‌ 5లో నిలిచిన అరియానా(Ariyana Glory) ఏడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. హాట్‌ లుక్‌లో కేకపెట్టిస్తుంది. 

611

ఎనిమిదో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌ ఐదో సీజర్‌లో హంగామా చేసిన నటరాజ్‌ మాస్టర్‌ రావడం విశేషం. ఆయన మాస్‌ ఎంట్రీతో అదరగొట్టారు. ఊహించినట్టే నటరాజ్‌ మాస్టర్‌ ఎంట్రీ ఇవ్వడం విశేషం. 

711

హాట్‌ బ్యూటీ తేజస్విని మదివాడ సైతం ఈ షోలో సందడి చేసింది. ఆమె 12వ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌ తెలుగు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. గ్లామరస్‌ లుక్‌లో ఆద్యంతం కనువిందు చేస్తుంది తేజస్విని.

811

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో ఫైర్‌ బ్రాండ్‌గా నిలిచిన సరయు మరోసారి బిగ్‌బాస్‌ షోలో సందడి చేసింది. ఆమె బిగ్‌ బాస్‌ తెలుగు ఓటీటీ హౌజ్‌లో 13వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. తనదైన గ్రాండ్‌ ఎంట్రీతో అదరగొట్టింది. 

911

ఇక బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో మోస్ట్ లవింగ్‌ అమ్మాయిగా నిలిచిన హమిద మరోసారి బిగ్‌బాస్‌ షోలో సందడి చేయబోతుంది. ఆమె బిగ్‌బాస్‌ తెలుగు ఓటీటీ హౌజ్‌లోకి 16వ కంటెస్టెంట్‌ గా ఎంట్రీ ఇచ్చింది. మరోసారి హౌజ్‌లో ప్రేమ పాఠాలు చెప్పేందుకు వచ్చింది.

1011

ఇక బిగ్‌బాస్‌ నాల్గవ సీజన్‌లో రన్నరప్‌గానిలిచిన అఖిల్‌ బిగ్‌బాస్‌ తెలుగు 6వ ఓటీటీ సీజన్‌లో మెరిశారు. ఈ సీజన్‌ లోకంటెస్టెంట్‌గా సందడి చేయడానికి వచ్చారు. `ఢీ` షోలో మెరుస్తున్న ఆయన ఇప్పుడు ఓటీటీ బిగ్‌బాస్‌లోకి రావడం విశేషం. 17వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు.

1111

నాగార్జున హోస్ట్ గా రన్‌ అయ్యే ఈ షో 24 గంటలు ప్రసారం కానుంది. ఎలాంటి ఫిల్టర్‌ లేకుండా ప్రసారం చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు రెండు టీమ్‌లుగా కొత్తవారు, పాత వారు కలిసి చేసే రచ్చ, ఫైటింగ్‌, డేటింగ్‌లో ఏ రేంజ్‌లో ఉంటాయనేది ఆసక్తి నెలకొంది. ఇది దాదాపు ఎనబై రోజులపాటు రన్‌ అవుతుం
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories