Biggboss Telugu OTT:వర్మ నగ్నం హీరోయిన్ శ్రీరాపాకతో పాటు షోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త కంటెస్టెంట్స్ వీరే!

Published : Feb 26, 2022, 09:11 PM IST

బిగ్ బాస్ సరికొత్త వర్షన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్' (Bigg boss Nonstop) 24 హౌర్స్ ఎంటర్టైన్మెంట్ పంచడానికి సిద్ధమైంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 26 నుంచి ప్రసారం అవుతుంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ (Bigg boss Telugu OTT)టెలివిజన్ లో ప్రసారమయ్యే రెగ్యులర్ షోకి కొంచెం విభిన్నం.

PREV
19
Biggboss Telugu OTT:వర్మ నగ్నం హీరోయిన్ శ్రీరాపాకతో పాటు షోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త కంటెస్టెంట్స్ వీరే!

కంటెస్టెంట్స్ ని రెండు గ్రూప్స్ గా విభజించారు. గత ఐదు సీజన్స్ లో పాల్గొన్న ఓల్డ్ కంటెస్టెంట్స్ ని వారియర్స్ గా, ఇంతవరకు ఒక్క సీజన్లో కూడా పాల్గొనని వారిని ఛాలెంజర్స్ గా పరిచయం చేశారు. హమీదా, అఖిల్, ముమైత్ ఖాన్, మహేష్ విట్టా, తేజస్వి మాదివాడ, అషురెడ్డి, అరియనా,సరయు గతంలో వివిధ సీజన్స్ లో పాల్గొన్న ఓల్డ్ కంటెస్టెంట్స్. మరి బిగ్ బాస్ నాన్ స్టాప్ తో ప్రేక్షకులను పలకరించనున్న కొత్త కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం.. 
 

29


ఛాలెంజర్స్ లో అజయ్ ఫస్ట్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ అజయ్ ఎవరంటే అప్ కమింగ్ హీరో. ఒకటి రెండు చిత్రాల్లో హీరోగా చేశారు. ఓ మేజర్ ఆక్సిడెంట్ లో అజయ్ తీవ్ర గాయాలపాలయ్యారు. నెలల తరబడి మంచానికే పరిమితమైన అజయ్ తిరిగి హీరోగా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నారు. 
 

39


నెక్స్ట్ ఛాలెంజర్ స్రవంతి చొక్కరపు. ఈమె సోషల్ మీడియా సెన్సేషన్. బుల్లితెరపై కూడా కొన్ని ఈవెంట్స్ లో సందడి చేశారు. యాంకర్ గా నటిగా ప్రయత్నాలు చేస్తున్న స్రవంతికి రెండు పెళ్లిళ్లు అయ్యాయట. ఫస్ట్ మ్యారేజ్ లేచిపోయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుందట. ప్రస్తుతం ఆమెకు భర్తతో పాటు కొడుకు ఉన్నాడు. 

49


రేడియో జాకీగా ఆర్జే చైతు ఫుల్ ఫేమస్. ఈ రేడియో జాకీ బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఆర్జే చైతు... సొంతింటి కలను నెరవేర్చుకోవాలని  అనుకుంటున్నాడు. రేడియో జాకీగా జాతీయ అవార్డ్స్ గెలుపొందాడు. 

59

రామ్ గోపాల్ వర్మ నగ్నం చిత్రంలో నటించిన శ్రీరాపాక ఓవర్ నైట్ సెన్సేషన్ అయ్యారు. నటిగా ఫ్యాషన్ డిజైనర్ గా కెరీర్ కొనసాగిస్తున్న రాపాక కబడ్డీ, కో కో క్రీడల్లో నేషనల్ లెవెల్ ప్లేయర్ కావడం విశేషం. 
 

69

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన అనిల్ రాథోడ్ పోలీస్ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చారు. బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులకు తన ప్రతిభ చూపించాలన్న లక్ష్యంతో బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఎంట్రీ ఇచ్చాడు. 

79

నటిగా కెరీర్ ప్రారంభించిన మిత్రా శర్మ.. సొంత నిర్మాణ సంస్థ స్థాపించి బాయ్స్ పేరుతో ఓ మూవీ నిర్మించారు. చిత్ర పరిశ్రమలో ఎదగడమే ఆమె లక్ష్యం కాగా... బిగ్ బాస్ షో తనకు మరింత గుర్తింపు తీసుకు వస్తుందని భావిస్తున్నారు.

89

కాంట్రవర్షియల్ యాంకర్ శివ యూట్యూబ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన గెస్ట్స్ ని ప్రశ్నలతో ముప్పతిప్పలు పెట్టే శివ... చిన్నప్పుడే ఇంటి నుండి బయటికి వచ్చేశాడు. అమ్మ ఆరోగ్యం కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. బిగ్ బాస్ షో ద్వారా డబ్బులు సంపాదించి చెల్లి పెళ్లి చేయాలనేది అతని ధ్యేయం.

99

తెలుగులో బంపర్ ఆఫర్, హరే రామ హరే కృష్ణ వంటి చిత్రాలలో నటించింది తెలుగు అమ్మాయి బిందు మాధవి. కోలీవుడ్ లో పదుల సంఖ్యలో చిత్రాలు చేసిన బిందు తమిళ్ బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. తెలుగులో మాత్రం ఇదే ఆమెకు మొదటి బిగ్ బాస్ షో.

click me!

Recommended Stories