Samantha Net Worth : సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్నారు. దంపతులుగా జీవితం స్టార్ట్ చేయబోతున్నారు. హీరోయిన్ గా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ చూసిన సమంత.. సినిమాలు వ్యాపారాలతో భారీగా ఆస్తులు పోగేసినట్టు తెలుస్తోంది. సమంత ఆస్తుల విలువ ఎంత?
సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి వార్త టాలీవుడ్ ను ప్రస్తుతం ఊపేస్తుంది . తమిళనాడు కోయంబతూర్ లో డైరెక్టర్ రాజ్ ను సమంత రెండో పెళ్ళి చేసుకుంది. తాజాగా ఈ విషయాన్ని ఆమె తన ఇన్ స్ట్రా గ్రామ్ లో వెల్లడించింది. నాగచైతన్యతో విడాకుల తరువాత చాలా కాలం సింగిల్ గానే ఉన్న సమంత... తనతో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ను డైరెక్ట్ చేసిన రాజ్ తో ప్రేమలోపడింది. రాజ్ కు అప్పటికే పెళ్లై విడాకులు అవ్వడం.. ఈ ఇద్దరి స్నేహం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసినట్టు తెలుస్తోంది. ఈక్రమంలో సమంత స్టార్ డమ్.. ఆస్తులు, వ్యాపారాల కు సబంధిచిన వార్తలు వైరల్ అవుతున్నాయి.
26
స్టార్ గా వెలుగు వెలిగిన సమంత
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది సమంత. హీరోయిన్ గా ఆమె భారీ స్థాయిలో ఆస్తులు సంపాదించినట్టు తెలుస్తోంది. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. సామ్ ఒక్క సినిమాకు 10 కోట్లకుపైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. 15 ఏళ్ల నుంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంద సమంత. సినిమాలు తో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, రకరకాల బిజినెస్ ల ద్వారా ఆమె కోట్లు సంపాదిస్తోంది. ఒక్క పుష్ప సినిమాలో ఊ అంటావా" పాట కోసం సమంత 5 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఏం మాయచేసావే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సామ్.. ఫస్ట్ సినిమా నుంచి నాగచైతన్యను ప్రేమించి.. 7 ఏళ్ల ప్రేమ తరువాత 2017లో పెళ్లి చేసుకున్నారు. 2021లో వీరు విడిపోయారు.
36
నిర్మాతగా సమంత సంపాదన
అనారోగ్యం కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సమంత.. మళ్ళీ కెరీర్‌లో దూసుకుపోతోంది. వరుస చిత్రాలకు సంతకాలు చేయడమే కాకుండా నిర్మాతగా కూడా మారింది. ఈమధ్యనే శుభం లాంటి సినిమాలతో సక్సస్ ఫుల్ నిర్మాతగా కోట్లు సంపాదిస్తోంది. ఇది కాకుండా, సమంత పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తోంది. ఆమెకు సామ్‌సంగ్, డ్రూల్స్, డ్రీమ్ 11, టామి హిల్ఫిగర్ వంటి బ్రాండ్లతో ఒప్పందాలు ఉన్నాయి. ఈ బ్రాండ్ల ద్వారా ఆమె సుమారు 10 కోట్ల వరకు సంపాదించిందని సమాచారం.
ఇక సమంత ఆస్తి మొత్తం 200 కోట్ల పైనే ఉంటుందని సమాచారం. ఈ స్టార్ హీరోయిన్ సినిమాలను మాత్రమే నమ్ముకోలేదు.. రియల్ ఎస్టేట్ తో పాటు రకరకాల రంగాలలో ఆమె పెట్టుబడులు పెట్టింది. ఆమె దగ్గర డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్.. 8 కోట్ల విలువైన మరో ఇంటితో పాటు సముద్ర తీర ప్రాంతంలో అద్భుతమైన సీఫేస్ ఇల్లు ఉందట. ఈ ఇంటి విలువ 15 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం. హైదరాబాద్, చెన్నై, ముంబాయిలో సమంతకు ఇళ్లు ఉన్నట్టు తెలుస్తోంది.
56
సమంత ఆస్తి, కార్ల కలెక్షన్
200 కోట్ల వరకూ ఆస్తి ఉన్న సమంత గ్యారేజ్ లో అద్భుతమైన కార్ల కలెక్షన్ ఉంది. BMW 7-సిరీస్, జాగ్వార్ XF, ఆడి Q7, మెర్సిడెస్ బెంజ్ G63 AMG కార్లు ఉన్నాయి. ఆమెకు లగ్జరీ కార్లంటే ఎంతో ఇష్టం కూడా. సమంత చాలా బ్రాండ్లలో పెట్టుబడులు పెట్టింది. క్లాత్, జ్యూవ్వెలర్రీ బిజినెస్ లో కూడా ఇన్వెస్ట్ చేసింది సామ్. అంతే కాదు సమాజ సేవలో కూడా ఆమె ముందు ఉంది. పిల్లల చదువు కోసం కూడా సపోర్ట్ చేస్తుంది. ఎన్నోఆర్ఫాన్స్ కు డొనేషన్లు ఇస్తోంది సమంత.
66
వ్యాపారంలో దూసుకెళ్తోన్న సమంత
సమంత రూత్ ప్రభు సినిమాల్లోనే కాకుండా వ్యాపార రంగంలోనూ తన సత్తా చాటుతుంది. ఇప్పటికే సమంత ‘సాకీ’ (Saaki) పేరుతో ఫ్యాషన్ బ్రాండ్‌ను విజయవంతంగా నడుపుతోంది. రీసెంట్ గా పెర్ఫ్యూమ్ బిజినెస్‌లో కూడా అడుగుపెట్టింది. తాజాగా ‘ట్రూలీ స్మా’ ద్వారా ఫ్యాషన్ రంగంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించబోతోంది. ఈ విషయాన్ని ఈమధ్యనే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది సమంత. ఇక రాజ్ కంటే కూడా సమంతే ఎక్కువ ఆస్తిని కలిగి ఉండటంతో పాటు.. లగ్జరీ లైఫ్ ను కూడా లీడ్ చేస్తోంది.