Allu Arjun: పాన్ ఇండియా రేంజ్ లో రీ- రిలీజ్ కాబోతున్న అల్లు అర్జున్ 22 ఏళ్ల పాత సినిమా

Published : Jun 20, 2026, 03:58 PM IST

ఈ మధ్య రీరిలీజ్ ట్రెండ్ బాగా వర్కౌట్ అవుతోంది. మేకర్స్ కు కాసుల పంట పండిస్తోంది. దంతో స్టార్ హీరోల పాత సినిమాలు బయటకు తీస్తున్నారు. అల్లు అర్జున్ 22 ఏళ్ల నాటి మూవీని పాన్ఇండియ రేంజ్ లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇంతకీ ఏంటా సినిమా. 

PREV
14
జోరందుకున్న రీ రిలీజ్ ట్రెండ్..

టాలీవుడ్‌లో మరోసారి రీ రిలీజ్ ట్రెండ్ జోరందుకుంది. గత కొంతకాలంగా స్టార్ హీరోల పాత సూపర్ హిట్ సినిమాలను మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటున్నారు మూవీ మేకర్స్. గతంలో తమ అభిమాన హీరో సినిమాలను థియేటర్లలో చూడలేకపోయిన అభిమానులు.. ఈ అవాకాశాలను ఉపయోగించుకుంటున్నారు. అంతే కాదు రీరిలీజ్ అయ్యే థియేటర్లలో అభిమానులు సీన్ రీ క్రియేట్ చేస్తూ.. వైరల్ అవుతున్నారు. ఇక తాజాగా కొంత మంది హీరోల పాత సినిమాలు రీరిలీజ్ కు క్యూ కడుతున్నాయి. ఈ నెల 26 నుంచి స్టార్ హీరోలకు చెందిన పలు క్లాసిక్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

24
థియేటర్లకు క్యూ కడుతున్న పాత హిట్ సినిమాలు..

స్టార్ హీరోల సూపర్ హిట్ పాత సినిమాలు ఈ నెల చివరి నుంచి థియేటర్లకు క్యూ కడుతున్నాయి. ఈనెల 26న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఒక్కడు రీరిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ఇప్పటికే ఒక సారి రీరిలీజ్ చేశారు. మరో సారి రీరిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఇదే రోజు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ను కూడా రీ రిలీజ్ చేయాలని చూశారు మేకర్స్.. కానీ పెద్ది సినిమా కలెక్షన్స్ కు ఇబ్బంది లేకుండా గబ్బర్ సింగ్ రీరిలీజ్ ను వాయిదా వేశారు. ఈ విషయాన్ని నిర్మాత బండ్ల గణేష్ స్వయంగా వెల్లడించారు. ఇక ఈమూవీతో పాటు జూన్ 27న మంచు విష్ణు కన్నప్ప కూడా రీరిలీజ్ కాబోతోంది.

34
అల్లు అర్జున్ పాత సినిమాలకు డిమాండ్ ఎక్కువ..

ఇక రీరిలీజ్ ట్రెండ్ లో అల్లు అర్జున్ సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఇక్కడే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా బన్నీ మూవీస్ ను విపరీతంగా ఆదరిస్తున్నారు అభిమానులు. కేరళలో అల్లు అర్జున్ కు భారీగా అభిమానులున్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాలన్నీ కేరళలో భారీగా కలెక్షన్స్ ను కూడా రాబడతాయి. రీసెంట్ గా అల్లు అర్జున్ హ్యాపీ మూవీని కేరళలో రీరిలీజ్ చేయగా.. అక్కడ అనూహ్యంగా భారీ స్పందన లభించింది. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.2 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందని సమాచారం. ఇంకా డీసెంట్ స్థాయి కలెక్షన్లతో ప్రదర్శన కొనసాగిస్తోంది.

44
పాన్ ఇండియా రేంజ్ లో ఆర్య రీరిలీజ్..

మలయాళంలో ‘హ్యాపీ’ సాధించిన విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ చిత్రాన్ని జులై నెలలో తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రీ రిలీజ్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేరళలో సాధించిన విజయాం ఇక్కడ లభిస్తుందో లేదో చూదాలి. అంతే కాదు పాన్ ఇండియాలో అల్లు అర్జున్ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని అల్లు అర్జున్ కెరీర్‌లో ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచిన ఆర్య సినిమాను జులైలో రీ రిలీజ్ చేయనున్నారు. హ్యాపీ’ చిత్రానికి మలయాళంలో వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకుని, ‘ఆర్య’ చిత్రాన్ని తెలుగు భాషతో పాటు దేశ వ్యాప్తంగా 5 భాషల్లో రీరిలీజ్ చేయాలని భావిస్తున్నారట.. మరి వీరి ప్రనయత్నం ఫలిస్తుందా? ఈ క్లాసిక్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాల్సి ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories