అనుష్క పేరుతో ఉన్న అరుదైన రికార్డ్ ఇప్పుడు బ్రేక్ అయ్యింది. 17 ఏళ్ల తర్వాత సమంత దాన్ని బ్రేక్ చేసింది. `మా ఇంటి బంగారం`తో రచ్చ చేసింది. తనే లేడీ సూపర్ స్టార్ అయిపోయింది.
సమంత మూడేళ్ల గ్యాప్ తర్వాత ఇటీవల `మా ఇంటి బంగారం` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతోంది. మహిళా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో ఊహించని విజయాన్ని అందుకుంది. బాక్సాఫీసు వద్ద అరుదైన రికార్డుని క్రియేట్ చేసింది. మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ క్రమంలో `మా ఇంటి బంగారం` మూవీ టాలీవుడ్‌లో అనుష్క పేరుతో ఉన్న రికార్డుని బ్రేక్ చేసింది.
24
అరుంధతితో అనుష్క అరుదైన రికార్డ్
లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో అనుష్క నటించిన `అరుంధతి` మూవీ అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. కోడి రామకృష్ణ రూపొందించిన ఈ మూవీ 2009లో విడుదలైంది. సూపర్ నేచ్చురల్ హర్రర్ ఫాంటసీగా యాక్షన్ మూవీగా ఇది రూపొందింది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సోనూ సూద్ విలన్‌గా నటించాడు. 17ఏళ్ల క్రితం విడుదలైన ఈ మూవీ అప్పట్లోనే అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. ఏకంగా రూ.70కోట్లు వసూలు చేసి అరుదైన రికార్డు ని క్రియేట్ చేసింది అనుష్క.
34
అరుంధతి రికార్డుని బ్రేక్ చేసిన సమంత మా ఇంటి బంగారం
తాజాగా అనుష్క `అరుంధతి` మూవీ రికార్డుని బ్రేక్ చేసింది సమంత. 17 ఏళ్ల అరుదైన రికార్డుని సామ్ బద్దలు కొట్టడం విశేషం. సామ్ నటించిన `మా ఇంటి బంగారం` మూవీ `అరుంధతి` రికార్డులను బ్రేక్ చేయడం విశేషం. సమంత కమ్ బ్యాక్ ఇస్తూ నటించిన ఈ మూవీ రెండు వారాల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. ఈమూవీ ఇప్పటి వరకు రూ.78కోట్లు వసూలు చేసింది. ఎనభై కోట్లకు చేరువలో ఉంది. ఈ రోజుతో ఆ టార్గెట్‌ని కంప్లీట్ చేస్తుంది. దీంతో ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా నిలిచింది. `అరుంధతి` పేరుతో ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేయడం విశేషం. దీంతో ఇప్పటివరకు తెలుగులో లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తోంది అనుష్క. ఆమె స్థానాన్ని ఇప్పుడు సమంత తీసుకోవడం విశేషం. ఈ సినిమా వంద కోట్లు వసూళ్లు చేస్తుందని టీమ్ భావించింది. కానీ అది సాధ్యం అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. కానీ తెలుగులో మాత్రం సమంత ఇప్పుడు లేడీ సూపర్ స్టార్‌గా అవతరించిందని చెప్పొచ్చు.
సమంత హీరోయిన్‌గా నటించిన `మా ఇంటి బంగారం` మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్ ప్లే అందించారు. డైరెక్షన్‌లోనూ ఆయన కూడా ఇన్‌వాల్వ్ అయ్యారు. ట్రాలాల పిక్చర్స్ పతాకంపై సమంత, రాజ్ నిడిమోరు కలిసి నిర్మించడం విశేషం. ఈ మూవీలో సమంతతోపాటు గుల్షన్ దేవయ్యా, దిగంత్, శ్రీముఖి, చైతన్యకృష్ణ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందిన విషయం తెలిసిందే.