ఒకప్పుడు సమంత అక్కినేని ఫ్యామిలిలో బాగా కలిసిపోయింది. నాగ చైతన్యని సమంత ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొనేళ్లు సమంత చైతూతో, అక్కినేని ఫ్యామిలీతో అన్యోన్యంగా గడిపింది. కానీ ఊహించని విధంగా చై, సమంత మాత్రం విభేదాలు వచ్చి విడిపోయారు. నాగార్జున, సమంత, నాగ చైతన్య కలసి మనం అనే చిత్రంలో నటించారు. ఆ మూవీ ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచింది.