నాని నెక్స్ట్ 'ప్యారడైజ్', టైటిల్ వెనక అసలు విషయం?

First Published | Nov 6, 2024, 8:48 AM IST

దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని తదుపరి చిత్రం 'ప్యారడైజ్' అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. సికింద్రాబాద్ పాతబస్తీ నేపథ్యంలో 80, 90 దశకాల నాటి సంచలనాత్మక సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.

Nani, Srikanth Odela, Dasara, Paradise


 హీరో నాని గతేడాది ‘దసరా’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలసిందే. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన మొదటి సినిమాతోనే తన టాలెంట్ ని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈ  క్రమంలో ఇదే కాంబినేషన్‌లో మరో సినిమా ప్లాన్ చేసారు.

‘దసరా’ చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. కొన్ని నెలల క్రితం విడుదలైన ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా కూడా ‘దసరా’ తరహాలో సింగరేణి నేపథ్య కథ అని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు టైటిల్ బయిటకు రావటం, మరిన్ని వేశేషాలు బయిటకు రావటం జరిగింది.
 

Nani, Srikanth Odela, Dasara, Paradise


అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రానికి ప్యారడైజ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు వినికిడి. ఇప్పటికే ఈ చిత్రం నిమిత్తం లొకేషన్స్ హాంట్ పూర్తైంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా చాలా వరకూ  వయొలెన్స్ తో నిండి ఉంటుందని చెప్తున్నారు.

మాగ్జిమం కథలో ఎక్కువ భాగం ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రం కథ సాగుతుందట. నాని గత చిత్రం ‘సరిపోదా శనివారం’ లో సోకులపాలెం అనే ఫిక్షనల్ ఏరియాని సృష్టించినట్టే.. ఈ సినిమాలో కూడా ఓ ఫిక్షనల్ ఏరియాని సృష్టించారట. దాని పేరు ‘ప్యారడైజ్’ అని తెలుస్తుంది. ఆ పదానికి ‘స్వర్గం’ అనే మీనింగ్ . కానీ సికింద్రాబాద్ లో ‘ప్యారడైజ్’ పేరుతో రెస్టారెంట్లు ఉంది. ప్యారడైజ్ అనేది చాలా పాపులర్ పేరు. 
 


Nani, Srikanth Odela, Dasara, Paradise


ఈ సినిమా బ్యాక్ డ్రాప్ మొత్తం సికంద్రాబాద్,పాత బస్తీలో జరుగుతుంది. ఆ మేరకు భారీ సెట్లు కూడా వేశారు. ఎనభై తొంభై దశకం మధ్య జరిగిన ఒక సంచలనాత్మక సంఘటనను బేస్ చేసుకుని శ్రీకాంత్ ఓదెల ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. అలాగే కథలో ... జంట నగరాల్లో కీలకమైన ల్యాండ్ మార్క్ గా చెప్పుకునే ప్యారడైజ్ నేపథ్యంలో కీలకమైన మలుపులు ఉందని ఈ టైటిల్ ని ఫిక్స్ చేసి  రిజిస్టర్ కూడా చేశారని అంటున్నారు.  

nani


అలాగే నాని ఈ సినిమాని  పాన్ ఇండియా మూవీగా చేయబోతున్నాడట. పక్క భాషల్లోని నటీనటులు కూడా ఈ సినిమాలో నటిస్తారు. దీనిని కూడా ‘ఎస్ ఎల్ వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీనికి ఏకంగా రూ.125 కోట్లు బడ్జెట్ పెట్టబోతున్నట్లు చెప్పుకుంటున్నారు.

Telugu actor Nani


నానికి పెరిగిన ఇమేజ్‌ దృష్ట్యా పాన్‌ ఇండియా సినిమాలనే ప్లాన్‌ చేస్తున్నారు హీరో నాని. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి ‘దసరా’ ఫేం శ్రీకాంత్‌ ఓదెల సినిమా కాగా, రెండోది శైలేష్‌ కొలను ఫ్రాంచైజీ ‘హిట్‌ 3’. ఈ రెండు పాన్‌ ఇండియా సినిమాలు త్వరలో సెట్స్‌కి వెళ్లనున్నాయి. 

పాన్‌ ఇండియా రిలీజ్‌ని దృష్టిలో పెట్టుకొని టైటిల్స్‌ విషయంలో టైటిల్స్ పెడుతున్నారు. ‘హిట్‌ 3’ టైటిల్‌ ఎలాగూ పాన్‌ఇండియాకు పర్‌ఫెక్ట్‌గా సరిపోతుందని భావిస్తున్నారు. అలాగే శ్రీకాంత్‌ ఓదెల సినిమా టైటిల్‌ కూడా అలాగే యూనివర్సల్‌గా ఉంటే బాగుంటుదనే‘ప్యారడైజ్‌’ అనే టైటిల్‌ పెట్టబోతున్నారట. 
 

Latest Videos

click me!