చిరంజీవితో రికార్డులు బద్దలు కొట్టాలని రాసుకున్న కథ, బాలయ్య వల్ల డైరెక్టర్ ఆశలు గల్లంతు.. ఏం జరిగిందంటే

First Published | Nov 6, 2024, 7:34 AM IST

 కొన్ని కాంబినేషన్స్ తప్పకుండా సెట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటుంటారు. అలాంటి కాంబినేషన్స్ లో చిరంజీవి - త్రివిక్రమ్.. చిరంజీవి - బాలయ్య లాంటి కాంబినేషన్స్ ఉంటాయి. వీళ్ళ కాంబోలో ఇంతవరకు ఒక్క చిత్రం కూడా రాలేదు. 

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చాలా మంది డైరెక్టర్స్ కోరుకుంటుంటారు. కానీ అవకాశాలు అందరికీ రావడం కష్టం.  కొన్ని కాంబినేషన్స్ తప్పకుండా సెట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటుంటారు. అలాంటి కాంబినేషన్స్ లో చిరంజీవి - త్రివిక్రమ్.. చిరంజీవి - బాలయ్య లాంటి కాంబినేషన్స్ ఉంటాయి. వీళ్ళ కాంబోలో ఇంతవరకు ఒక్క చిత్రం కూడా రాలేదు. 

త్రివిక్రమ్.. చిరంజీవి జై చిరంజీవ చిత్రానికి మాటలు అందించారు కానీ ఆయన్ని డైరెక్ట్ చేయలేదు. ఇక బోయపాటితో మెగాస్టార్ సినిమా ఇంతవరకు సెట్ కాలేదు. బోయపాటి ఓ ఇంటర్వ్యూలో చిరంజీవితో సినిమా చేయాలనే తన కోరిక బయట పెట్టారు. హీరోలకు ఊర మాస ఎలివేషన్ ఇవ్వడంలో ప్రస్తుతం టాలీవుడ్ లో బోయపాటి తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. 


అలాంటి బోయపాటి చిరంజీవి కోసం కథ కూడా రాసుకున్నారట. కానీ మెగాస్టార్ తో కాంబినేషన్ సెట్ కాలేదు. చిరంజీవితో సినిమా చేయాలని అనుకునే లోపు బాలయ్యతో మూవీ సెట్ అయింది. అదే అఖండ చిత్రం. అఖండ ఇటు బోయపాటి, అటు బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బాలయ్యని బోయపాటి అఘోర పాత్రలో వైవిధ్యంగా చూపించారు బోయపాటి. 

అఖండ తర్వాత తన సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి అని బోయపాటి అన్నారు. అఖండకి ముందు చిరంజీవి గారి కోసం రాసుకున్న కథ ఇప్పుడు వర్కౌట్ కాదు. ఎందుకంటే అఖండ తర్వాత నా నుంచి ఇంకా భారీతనం వైవిధ్యం ఆడియన్స్ కోరుకుంటున్నారు అని బోయపాటి అన్నారు. 

ఇప్పుడు చిరంజీవి గారితో సినిమా చేయాలంటే అఖండని మించేలా భారీ కథ కావాలి. చిరంజీవి గారిని వెరైటీగా ప్రజెంట్ చేయాలి. అలాంటి కథ సెట్ అయితే వెంటనే ఆయనకి చెబుతాను అని బోయపాటి అన్నారు. అఖండకి ముందు రాసుకున్న కథ మాత్రం ఇక వర్కౌట్ కాదు అని తేల్చేశారు. ప్రస్తుతం బోయపాటి బాలయ్యతో అఖండ 2 కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. 

Latest Videos

click me!