Samantha Baby: సమంతకు బాబు పుట్టగానే మేనత్త ఏం చేసిందో తెలుసా? శీతల్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా

Published : Nov 22, 2026, 01:12 PM IST

Samantha Baby: నయనతార, త్రిష, కాజల్ తో పాటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ సమంత, రాజ్ దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. అభిమానులు సైతం సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో సమంత బాబు పుట్టడాని తెలిసి మేనత్త శీతల్ ఏం చేసిందో తెలుసా?

PREV
14
సమంత బాబు కోసం మేనత్త ఏం చేసిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు జీవితంలో సరికొత్త సంతోషం మొదలైంది. దర్శకుడు రాజ్ నిడిమోరు, సమంత దంపతులు తమ తొలి బిడ్డ రాకతో సంబరపడిపోతున్నారు. నవంబర్ 19న సమంత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ క్యూట్ బాబుకు 'దేవ్ నిడిమోరు' అని పేరు కూడా పెట్టారు. ఈ గుడ్ న్యూస్ విని ఫ్యాన్స్ అంతా ఖుషీ అవుతుంటే, రాజ్ నిడిమోరు సోదరి శీతల్ చేసిన ఓ స్పెషల్ పని అందరి దృష్టినీ ఆకర్షించింది.

బుజ్జి బాబు ఆరోగ్యం, ఆయుష్షు, భవిష్యత్తు బాగుండాలని శీతల్ మూడు మతాలకు చెందిన పవిత్ర స్థలాలకు వెళ్లి ప్రార్థనలు చేశారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల ప్రార్థనా మందిరాలకు వెళ్లి బాబు కోసం ఆశీర్వాదం తీసుకోవడం చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటున్నారు.

24
రాజ్ నిడిమోరు సోదరి శీతల్

రాజ్ నిడిమోరు సోదరి శీతల్, తన పిన్నితో కలిసి ముంబైలోని ఫేమస్ సిద్ధివినాయక టెంపుల్, హాజీ అలీ దర్గా, సెయింట్ మైఖేల్ చర్చికి వెళ్లారు. విశేషం ఏంటంటే, ఏకాదశి రోజున ఉపవాసం ఉంటూనే ఈ మూడు చోట్లకు వెళ్లి బుజ్జి దేవ్ కోసం ఆమె ప్రార్థనలు చేశారు. ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్‌కు సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దేవ్ తమకు దేవుడిచ్చిన అద్భుతమైన బహుమతి అని ఆమె చెప్పుకొచ్చారు.

'సర్వ మంగళాని భవంతు'

శీతల్ పెట్టిన పోస్ట్‌లోని ఎమోషనల్ మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 'అమ్మ ప్రేమతో బాబుకు దిష్టి తీసినప్పుడు, అతనిపై పడే ప్రతి చూపు ఆశీర్వాదంగా మారాలి' అని ఆమె ఆకాంక్షించారు. దేవ్ మతాల హద్దుల్లో ఇరుక్కుపోకుండా అందరినీ ప్రేమించే, ప్రతి మతాన్ని గౌరవించే, మనుషులను కలిపే తెలివి ఉన్న వ్యక్తిగా ఎదగాలని కోరుకున్నారు.

అంతేకాదు, రాజ్, సమంత తమ బుజ్జి బాబుతో కలిసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టారని, వాళ్ల ఫ్యామిలీలో ప్రేమ, సంతోషం ఇంకా పెరగాలని ఆమె ఆశించారు. చివరిగా 'సర్వ మంగళాని భవంతు' అని రాస్తూ తన ప్రార్థనను ముగించారు.

34
సీతాఫల్ క్రీమ్ తింటూ..

ఈ మూడు చోట్ల ప్రార్థనలు చేశాక, హాజీ అలీ జ్యూస్ సెంటర్‌లో సీతాఫల్ క్రీమ్ తింటూ ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నట్లు శీతల్ తెలిపారు. ఫ్యామిలీలోని ఈ ఆనందాన్ని ఇలా సర్వమత సామరస్యంతో పంచుకోవడం నిజంగా స్పెషలే.

ఇక సమంత కూడా నవంబర్ 20న తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాబు పుట్టిన విషయాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంది. బుజ్జి బాబు చెయ్యి పట్టుకున్న ఓ క్యూట్ ఫోటోను షేర్ చేస్తూ, 'మా బుజ్జి బాబు దేవ్ నిడిమోరు. 19.11.2026. మా మనసులు ఎప్పటికంటే ఎక్కువగా సంతోషంతో నిండిపోయాయి' అని రాసుకొచ్చింది.

44
ఎవరెవరు విష్ చేశారంటే?

ఈ న్యూస్ బయటకు రాగానే సినిమా ఇండస్ట్రీ వాళ్లు, ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నయనతార, త్రిష కృష్ణన్, కాజల్ అగర్వాల్, నజ్రియా నజీమ్, వరలక్ష్మి శరత్‌కుమార్, మంచు లక్ష్మి, సింగర్ చిన్మయి శ్రీపాద, ఉపాసన కొణిదెల, యాక్టర్ విక్కీ కౌశల్‌తో పాటు ఎంతోమంది సెలబ్రిటీలు సమంత, రాజ్ దంపతులకు కంగ్రాట్స్ చెప్పారు.

మొత్తానికి దేవ్ నిడిమోరు రాకతో ఫుల్ జోష్‌లో ఉన్న ఫ్యామిలీకి శీతల్ చేసిన ఈ స్పెషల్ పూజలు మరింత ఎమోషనల్ టచ్ ఇచ్చాయి. మతం కంటే మానవత్వం, ప్రేమే గొప్పది అని చాటిచెప్పిన ఆమె పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories