2026లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాప్ 5 హీరోయిన్లు వీళ్లే.. కోట్లల్లో కలెక్షన్స్ సాధించిన తారలు ఎవరంటే?

Published : Nov 22, 2026, 11:40 AM IST

2026లో తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన టాప్ 5 ఇండియన్ హీరోయిన్ల లిస్ట్ ఇది. ఈ ఐదుగురు భామలు నటించిన సినిమాలు వసూళ్ల వరద పారించాయి. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరు? ఏంటా సినిమాలు? వాటి కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

PREV
16
బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన టాప్ 5 హీరోయిన్లు

2026 ముగియడానికి ఇంకో నెల మాత్రమే ఉంది. ఈ ఏడాదిలో పలు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. సినిమా లవర్స్ కు మాత్రమే కాదు, ఈ సంవత్సరం కొంతమంది హీరోయిన్లకు కూడా బాగా కలిసొచ్చింది. 2026లో బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు రాబట్టిన టాప్ 5 ఇండియన్ యాక్ట్రెస్ ఎవరు అనేది ఈ స్టోరీలో చూద్దాం.

26
సారా అర్జున్

బాక్సాఫీస్ హిట్‌ లిస్ట్‌లో మొదటి స్థానంలో సారా అర్జున్ ఉన్నారు. ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన 'ధురంధర్ 2' సినిమాలో ఆమె నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 1,813.39 కోట్లు కలెక్ట్ చేసింది. సారా అర్జున్ - రణవీర్ సింగ్ జోడీని జనాలు బాగా రిసీవ్ చేసుకున్నారు.

36
లారా దత్తా

రెండవ స్థానంలో 90లనాటి బ్యూటీ లారా దత్తా నిలిచారు. 2026లో ఆమె రెండు బిగ్ బడ్జెట్ సినిమాల్లో యాక్ట్ చేశారు. అక్షయ్ కుమార్ మల్టీ-స్టారర్ 'వెల్‌కమ్ టు ది జంగల్' వరల్డ్ వైడ్‌గా రూ. 192.75 కోట్లు రాబట్టింది.

రెండవ సినిమా 'రామాయణ'. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 1,574.60 కోట్లు సంపాదించింది. ఈ రెండు సినిమాలతో కలిపి లారా దత్తా మొత్తం రూ. 1,767.35 కోట్లు కలెక్షన్లు అందించారు.

46
రకుల్ ప్రీత్ సింగ్

మూడవ ప్లేస్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు. 2026లో ఆమె కూడా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మొదట వచ్చిన 'పతి పత్ని ఔర్ వో దో' రూ. 67.96 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత నితీష్ తివారీ డైరెక్షన్ లో వచ్చిన 'రామాయణ' తో వరల్డ్ వైడ్ గా రూ. 1,574.60 కోట్లు రాబట్టారు. ఈ రెండూ కలిపి ఆమె రూ. 1,642.56 కోట్లు కలెక్ట్ చేశారు.

56
సాయి పల్లవి

సౌత్ సెన్సేషన్ సాయి పల్లవి నాలుగో స్థానంలో ఉంది. 2026లో ఆమె ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశారు. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్‌తో తీసిన 'ఏక్ దిన్' ఫ్లాప్ అయ్యి, కేవలం రూ. 5.52 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కానీ రెండవ సినిమా భారీ బడ్జెట్ 'రామాయణ' వరల్డ్ వైడ్‌గా రూ. 1,574.60 కోట్లు కురిపించింది.

మూడవ సినిమా 'ఓం చాప్టర్ 1'. నవంబర్ 20న రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజే రూ. 17.70 కోట్లు రాబట్టింది. ఈ మూడింటితో కలిపి సాయి పల్లవి రూ. 1,597.82 కోట్లు బాక్సాఫీస్ కి అందించారు.

66
మమితా బైజు

మలయాళం బ్యూటీ మమితా బైజు ఈ లిస్ట్‌లో ఐదవ స్థానంలో ఉన్నారు. 2026లో ఆమె నాలుగు సినిమాలు చేశారు. 'జన నాయగన్' రూ. 327.81 కోట్లు, 'కర' రూ. 54.82 కోట్లు, 'విశ్వనాథ్ అండ్ సన్స్' రూ. 212.34 కోట్లు, అండ్ 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' రూ. 333.09 కోట్లు వసూలు చేశాయి. టోటల్ గా మమితా బైజు ప్రపంచవ్యాప్తంగా రూ. 928.06 కోట్లు కలెక్షన్స్ ని జనరేట్ చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories