ఇక జబర్దస్త్ ద్వారా అత్యంత పాపులారిటీ తెచ్చుకున్న గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ ఈ వివాదంపై నోరు విప్పలేదు. అయితే జబర్దస్త్ మాజీ మేనేజర్ ఏడుకొండలు ఎంట్రీతో గెటప్ శ్రీను స్పందించారు. నేరుగా, పరోక్షంగా ఏడుకొండలుపై కౌంటర్లు విసిరారు. జబర్దస్త్ ఆరంభం నుండి మేనేజర్ గా ఉన్న ఏడుకొండలు అసలు షో ఎలా స్టార్ట్ అయ్యింది, ఎవరెవరి రెమ్యూనరేషన్స్ ఏమిటీ? జరిగిన రాజకీయాలు ఏమిటనే అనేక విషయాలు బయటపెట్టారు.