Samantha: నాగ చైతన్య చేసిన అన్యాయం తలచుకొని రగిలిపోతున్న సమంత?... ఈ కోల్డ్ వార్ పర్యవసానం అదేనా!

Published : Jun 23, 2022, 05:59 PM IST

సమంత, నాగ చైతన్యల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. విడాకులు తీసుకుని ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారులే అని అందరూ అనుకుంటున్నారు. కానీ వాళ్ళ మధ్య పగ, ప్రతీకారాలు చోటు చేసుకున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

PREV
16
Samantha: నాగ చైతన్య చేసిన అన్యాయం తలచుకొని రగిలిపోతున్న సమంత?... ఈ కోల్డ్ వార్ పర్యవసానం అదేనా!
Naga chaitanya samantha


గత ఏడాది చడీ చప్పుడు లేకుండా సమంత(Samantha), నాగ చైతన్య దూరంగా వేరు వేరు ఇళ్లలోకి చేరారు. ఈ విషయం మెల్లగా మీడియా దృష్టికి వచ్చింది. సమంత, నాగ చైతన్య మధ్య విబేధాలు విడాకులకు సిద్దమైన జంట అంటూ  కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై సమంత, నాగ చైతన్య మౌనం వహించారు. 
 

26

2021 అక్టోబర్ నెలలో సోషల్ మీడియా వేదికగా విడాకుల ప్రకటన చేశారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు తెలియజేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత, చైతు ఎందుకు విడిపోయారనేది సస్పెన్స్ గా మారింది. ఈ క్రమంలో కొన్ని పుకార్లు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా సమంతపై కొన్ని ఆరోపణలు తలెత్తాయి. ఈ ఆరోపణలకు సమంత స్పందించారు. నిరాధారమైన కథనాలు అంటూ ఖండించారు. 
 

36


విడాకులు తీసుకున్న సమంత పరోక్షంగా నాగ చైతన్య(Naga Chaitanya)ను ఉద్దేశిస్తూ పోస్ట్స్ పెడుతూ ఉండేవారు. సదరు పోస్ట్స్ లో ఆమె ఆవేదన, చైతుపై కోపం అవగతం అవుతూ ఉండేది. నాగ చైతన్య మాత్రం మౌనం వహించారు. ఆయన ఎలాంటి సోషల్ మీడియా పోస్ట్స్ చేయలేదు. 
 

46


సమంత గుండెల్లో మాత్రం అగ్నిపర్వతం ఉంది. అది ఎప్పుడో పేలనుంది. సమంత అలా మారడానికి పూర్తిగా నాగ చైతన్య కారణమనిపిస్తుంది. నాగ చైతన్య చర్యలు ఆమెను మానసిక క్షోభకు గురి చేశాయనే అనుమానం కలుగుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటే చైతూ అలా చేయడం ఆమెకు నచ్చలేదు. విడాకుల బాధను మర్చిపోవడానికి ఆమె పలు పుణ్యక్షేత్రాలు దర్శించారు. స్నేహితులతో విహారాలకు వెళ్లారు. 

56


తనను వేధించి విడాకులు తీసుకుంది కాక, తనదే తప్పంటూ నాగ చైతన్య స్వయంగా ప్రచారం చేయించాడని సమంత నమ్ముతున్నారు. సమంతకు పిల్లలు కనడం ఇష్టం లేదని, పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ తో అఫైర్ అంటూ వచ్చిన వార్తల వెనుకవుంది నాగ చైతన్యే అనే ఆమె గట్టి నమ్మకం. ఆ కారణంగానే చైతు, శోభిత ధూళిపాళ్ల ఎఫైర్ రూమర్స్ పై వెంటనే ఆమె స్పందించారు. 

66

ఏది ఏమైనా సమంత చైతన్యపై చాలా కోపంగా ఉన్నారనేది నిజం. అందుకే కెరీర్ లో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నారు . చైతు ఈర్ష్య పడేలా టీనేజ్ జీవితం ఉండాలని ఆశ పడుతున్నారు. బోల్డ్ ఫోటో షూట్స్, వరుస ప్రాజెక్ట్స్ ప్రకటించడం వెనుక కారణం ఇదే. మొత్తంగా సమంత, చైతు కోల్డ్ వార్ ఈ పరిణామాలకు దారి తీయనుందో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories