ఆయన వస్తూ వస్తూనే పూరి వైఫ్ లావణ్య గురించి మాట్లాడారు. మా వదిన అంటూ ఆమె గురించి చాలా ఉన్నతంగా మాట్లాడారు. లావణ్య వదిన శ్రీజాతిలోనే ఉత్తమురాలు. ఒక మంచి అక్క, భార్య, కోడలు, వదిన, తల్లి ఆమెలో ఉన్నారు. నేను సీతమ్మవారిని చూడలేదు కానీ సీతమ్మ అంత సహనం లావణ్య గారిలో ఉంది. పాండవుల తల్లి కుంతీ అంత మహోన్నత వ్యక్తి లావణ్య అంటూ కొనియాడారు.