ఆయన ఇంకా చెబుతూ, ఈ అండర్ స్టాండింగ్ తన విషయంలోనే కాదు, పిల్లల విషయంలోనూ ఉందన్నారు. `మా కుటుంబంలో దాదాపు పది మంది పిల్లలు ఉంటే వాళ్లు కూడా అంతే అండర్‌స్టాండింగ్‌తో ఉంటారు. సొంత అన్నదమ్ముళ్లు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గానే ఉంటారు. మేం ముగ్గురం బ్రదర్స్ ఎలాగూ కలిసే ఉంటాం, కానీ కజిన్స్ లెవల్‌లో కూడా అంతే బాగా కలిసి ఉండటం గొప్ప విషయం. దీనికి కారణం మా అన్నయ్య. ఆయన అందరు కలిసి ఉండాలని కోరుకుంటారు. అదే క్యారెక్టర్ చరణ్ బాబుకి, పెద్దమ్మాయి సుస్మితకి వచ్చింది. ఈ ఇద్దరి వల్ల మిగిలిన వాళ్ల మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. అది కంటిన్యూ అవుతుంది. చరణ్, సుస్మిత మా అబ్బాయి, అమ్మాయిని, తేజ్, వైష్ణవ్‌ని, ఇలా అందరిని బాగా చూసుకుంటారు. ఏ అవసరం వచ్చినా అండగా ఉంటారు. ఎవరు ఏమైనా అన్నా సపోర్ట్ గా వెళ్తారు. అదంతా మా అన్నయ్య వల్ల, మా అన్నయ్యకి అమ్మ వల్ల వచ్చింది. దాన్ని చరణ్, సుస్మిత కొనసాగిస్తున్నారు.