చిత్ర పరిశ్రమకు, సినీ అభిమానులకు ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్. సమంత, నాగచైతన్య అధికారికంగా విడిపోయారు. తమ వైవాహిక బంధానికి తెరదించారు. దాదాపు పదేళ్ల క్రితం వీరిద్దరూ తొలి సారి కలుసుకున్నారు. ఏ మాయ చేసావే చిత్రంతో మొదలైన వీరిద్దరి ప్రయాణం వివాహ బంధం వరకు వెళ్ళింది. 2017లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా నేడు ఇద్దరం విడిపోతున్నట్లు ప్రకటించారు.