నాగచైతన్య-సమంత విడాకుల్లో ట్విస్ట్ లు, టర్న్ లు.. ఈ ఆర్నెళ్లలో ఏం జరిగింది?

Published : Oct 02, 2021, 04:43 PM IST

సమంత, నాగచైతన్య టాలీవుడ్‌కి బిగ్‌ షాక్‌ ఇచ్చారు. విడాకులు తీసుకుంటున్నట్టు శనివారం మధ్యాహ్నం ప్రకటించారు. విడిపోవడం వెనుక ఏం జరిగింది. ఆర్నెళ్లలో వీరి మధ్య ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

PREV
19
నాగచైతన్య-సమంత విడాకుల్లో ట్విస్ట్ లు, టర్న్ లు.. ఈ ఆర్నెళ్లలో ఏం జరిగింది?

సమంత, నాగచైతన్య టాలీవుడ్‌లో క్రేజీ కపుల్‌. మోస్ట్ రొమాంటిక్‌ కపుల్‌. మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌కి పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్. అలాంటిది టాలీవుడ్‌ మాత్రమేకాదు, వారిద్దరి అభిమానులను కలవరానికి గురి చేశారు. విడాకులు ప్రకటించి మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా చేశారు. ఎవరూ జీర్ణించుకోలేని విధంగా చేశారు. ప్రస్తుతం డైవర్స్ తో సంచలనాలకు తెరలేపారు. 

29

సమంత, నాగచైతన్య చివరగా `ఆహా`లో ప్రసారమైన `సామ్‌ జామ్‌`లో సందడి చేశారు. ఈ రియాలిటీ టాక్‌ షోలో చివరి గెస్ట్ గా చైతన్యనే పాల్గొనడం విశేషం. ఆ తర్వాత వీరిద్దరు క్లోజ్‌గా మూవ్‌ అయిన సందర్భాలు చాలా తక్కువ. రెండు నెలల క్రితం నాగచైతన్య హిందీ సినిమా `లాల్‌ సింగ్‌ చద్దా` షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు కూడా ఆయనకు బెస్ట్ విషెస్‌ తెలిపింది. 

39

కానీ సమంత ఆ తర్వాత తన ట్విట్టర్‌, ఇన్‌స్టా గ్రామ్‌లో `అక్కినేని` అనే పేరుని తీసేసింది. కానీ ఆమె ప్రస్తుతం `శాకుంతలం` చిత్రంలో నటిస్తున్న నేపథ్యంలో ఆ సినిమా కోసం అలా మార్చుకున్నారని వినిపించింది. అదేసమయంలో చైతూతో చెడిందా అనే రూమర్స్ వెల్లువెత్తాయి. కానీ వీటిపై ఇప్పటి వరకు స్పందించ లేదు.

49

సమంత ఫస్ట్ టైమ్ వెబ్‌ సిరీస్‌ `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2`లో నటించారు. ఆ వెబ్‌ సిరీస్‌కి నార్త్, సౌత్‌లో బాగా గుర్తింపుని తీసుకొచ్చింది. ఇందులో బోల్డ్ రోల్‌ చేసింది సమంత. ఇంటిమేట్‌ సీన్లలోనూ సమంత యాక్ట్ చేసి అభిమానులకు షాకిచ్చింది. సమంత,చైతూల మధ్య గ్యాప్ కి ఇదొక కారణమని టాక్‌. 

59

అంతేకాదు ఫస్ట్ టైమ్ సమంత ఒంటరిగా వెకేషన్‌ వెళ్లింది. చైతూతో కాకుండా ఆమె స్నేహితులతో కలిసి వెకేషన్‌ వెళ్లారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయనే వార్త మరింతగా వైరల్‌ అయ్యింది.

69

దీనికి తోడు నాగార్జున బర్త్ డేకి సమంత హాజరు కాలేదు. కేవలం సోషల్‌ మీడియా ద్వారానే విషెస్‌ తెలిపారు. మరోవైపు నాగచైతన్య నటించిన `లవ్‌ స్టోరి` ప్రమోషన్‌ టైమ్‌లోనూ సమంత లేదు. ఆ సమయంలో ఇతర హీరోయిన్లతో సమంత పార్టీలు చేసుకుంది. వెకేషన్‌ ఎంజాయ్‌ చేసింది. చైతూ కోసం ఏకంగా అమీర్‌ ఖాన్‌ గెస్ట్ గా రాగా, సమంత లేకపోవడం విడాకుల వార్తలకు మరింత ఊతమిచ్చినట్టయ్యింది. 

79

అంతేకాదు `లవ్‌స్టోరి` సినిమా ట్రైలర్‌ విడుదలప్పుడు కూడా సాయిపల్లవిని అభినందిస్తూ ట్వీట్‌ చేసింది కానీ, చైతూకి విషెస్‌ చెప్పలేదు. ఇవన్నీ సమంత, చైతూలు విడిపోతున్నారని సోషల్‌ మీడియాలో వార్తలు మరింతగా ఊపందుకున్నాయి. 
 

89
Samantha

దీనికితోడు ఇటీవల చైతూ స్పందిస్తూ, ఈ వార్తలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వార్తలు బాధించాయని తెలిపారు. వార్తలకు వార్తే సమాధానం చెబుతుందన్నారు. మరోవైపు సమంత కూడా చైతూ నుంచి విడిపోయి ముంబయిలో సెటిల్‌ అవుతుందని వార్తలొచ్చాయి. ఇటీవల `సాకీ` ఏడాది సందర్భంగా అభిమానులతో చేసిన ఛాటింగ్‌లో సమంత స్పందిస్తూ తాను ఎక్కడికి వెళ్లిపోవడం లేదని, హైదరాబాద్‌ తన హోమ్‌ టౌన్‌ అని, రూమర్లలో నిజం లేదని, ఎందుకు ఈ రూమర్లు వస్తున్నాయో అర్థం కావడం లేదని తెలిపింది. 

99

మరోవైపు వీరిద్దరు బేబీకి ప్లాన్‌ చేస్తున్నారని, అందుకే కాస్త వెకేషన్‌ ఎంజాయ్‌ చేసేందుకు సమంత వెళ్లిందని అన్నారు. కానీ దానికి చెక్‌ పెడుతూ శనివారం డైవర్స్ ప్రకటించి బిగ్‌ షాక్‌ ఇచ్చారు. అభిమానులను కలవరానికి గురి చేశారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories