సమంత, నాగ చైతన్య విడిపోయి మూడేళ్లు గడుస్తోంది. నాగ చైతన్య అయితే రెండో పెళ్ళికి కూడా రెడీ అయిపోయాడు. త్వరలో శోభిత ధూళిపాలతో నాగ చైతన్య వివాహం జరగనుంది. డిసెంబర్ 4న ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆగస్టులో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. అయితే చైతు, సమంత విడిపోయినప్పటికీ వీళ్ళిద్దరూ ఎలాంటి కామెంట్స్ చేసినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.