హీరోయిన్లతో అల్లు అర్జున్ లవ్ ఎఫైర్స్, అల్లు స్నేహకి మొత్తం తెలుసు.. అయినా పెళ్ళెందుకు చేసుకుందంటే

First Published | Nov 16, 2024, 10:36 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం మరో మూడు వారాల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఒక వైపు పుష్ప 2 హంగామా మొదలవుతుంటే మరోవైపు అల్లు అర్జున్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం మరో మూడు వారాల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఒక వైపు పుష్ప 2 హంగామా మొదలవుతుంటే మరోవైపు అల్లు అర్జున్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ కి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ. చాలా మంది హీరోయిన్లకు కూడా అల్లు అర్జున్ అంటే ఇష్టం. 

చిత్ర పరిశ్రమలో హీరోలు , హీరోయిన్ల గురించి రూమర్స్ తప్పవు. ప్రతి హీరో హీరోయిన్ ఏదో ఒక సందర్భంలో రూమర్స్ ఎదుర్కొని ఉంటారు. వాటిలో చాలా వరకు నిజం అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. పెళ్ళికి ముందు అల్లు అర్జున్ పర్సనల్ లైఫ్ గురించి కూడా రూమర్స్ వచ్చాయి. కొంతమంది హీరోయిన్లతో బన్నీ ప్రేమాయాం సాగించాడని అప్పట్లో పుకార్లు వినిపించాయి. తనతో ఎక్కువగా కలసి నటించిన కొందరు హీరోయిన్ల ప్రేమలో బన్నీ పడ్డాడని ప్రచారం జరిగింది. 


దీనిపై అల్లు అర్జున్ కి అన్ స్టాపబుల్ షోలో బాలయ్య నుంచి ప్రశ్న ఎదురైంది. నా పర్సనల్ లైఫ్ లో నా భార్య దగ్గర ఏ విషయాన్ని నేను దాచిపెట్టలేదు. పెళ్ళికి ముందు నాకున్న ఎఫైర్ల గురించి స్నేహకి తెలుసు. నా గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది.. వాళ్ళు ఎవరు అనే డీటెయిల్స్ ఇప్పుడు అనవసరం. లైఫ్ లో మ్యారేజ్ అనేది ఒక రీసెట్ బటన్. 

Allu Arjun

మ్యారేజ్ కి ముందు మన వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నప్పటికీ.. పెళ్లి అయ్యాక ఎలా ఉన్నాం అనేది ముఖ్యం. నా భార్యకి మాత్రం అన్ని విషయాలు చెప్పా. ఎలాగోలా మేనేజ్ చేసుకున్నా అంటూ అల్లు అర్జున్ ఫన్నీగా బదులిచ్చారు. టీనా భార్యతో తొలి చూపులోనే అల్లు అర్జున్ ప్రేమలో పడ్డాడట. 

ఒకసారి ప్రేమ పెరిగాక గతం గురించి ఎవరూ ఆలోచించరు. అందుకే స్నేహ, నేను ఒక్కటయ్యాం అని అల్లు అర్జున్ తెలిపారు. అల్లు స్నేహ కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. మహేష్, రాంచరణ్, ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరోల సతీమణులతో కలసి అప్పుడప్పుడూ స్నేహ పార్టీల్లో ఎంజాయ్ చేయడం చూస్తూనే ఉన్నాం. 

Latest Videos

click me!