అయితే తన పాత్ర కంటే జగపతిబాబు చేసిన బసిరెడ్డి పాత్ర గొప్పగా ఉందని ఎన్టీఆర్ అనేవాడట. జగపతిబాబును రోజూ తిట్టేవాడట. ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు మాట్లాడుతూ... అరవింద సమేత చిత్రంలో నాది ఎక్స్ట్రా ఆర్డినరీ రోల్. కథకు బాగా వర్క్ అవుట్ అయ్యింది. దురదృష్టవశాత్తు నాది అగ్రెసివ్ క్యారెక్టర్, తారక్ పాసివ్ క్యారెక్టర్ చేశారు.
అందుకే నా పాత్ర బాగా వచ్చింది. అసలు తారక్ వంటి స్టార్ హీరో అలాంటి యాటిట్యూడ్ తో కూడిన క్యారెక్టర్ ఒప్పుకోవడమే కష్టం. అయితే దానికి సరిపడా శిక్ష నాకు తారక్ విధించాడు. రోజూ రాత్రి వాయించేసేవాడు. నువ్వు నన్ను ఇట్లా చేస్తున్నావ్ అట్లా చేస్తున్నావ్, నీ క్యారెక్టర్ బాగుంది అని తిట్టేవాడు. అవన్నీ ఓకే. అంటే ప్రేమగానే తిట్టేవాడు.