పాప కోసం ప్రాణాలకు తెగించిన సల్మాన్ ఖాన్... రియల్ హీరో అనిపించుకున్న బాలీవుడ్ స్టార్..

First Published | Aug 2, 2024, 12:41 PM IST

మంచి మనసు చాటుకున్నాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఓ చిన్నారి ప్రాణం కాపాడటం కోసం ప్రాణాలకు తెగించాడు. ఇంతకీ ఆయన ఏం చేశాడో తెలుసా..? 

బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్  సల్మాన్ ఖాన్  ఇప్పటికీ అమ్మాయిల కలల రాకుమారుడిగానే ఉన్నాడు. హీరోయిన్స్ తో  సల్మాన్ రొమాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక 60 ఏళ్లకు అతి దగ్గరలో ఉన్న ఈ బ్యాచిలర్ హీరో.. ఇప్పటికీ వరుస సినిమాలతో సందడి చేస్తూనే ఉన్నాడు. ఇక  ప్రస్తుతం గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి ప్రాణహాని ఎదుర్కొంటున్నాడు సల్మాన్ ఖాన్. కృష్ణజింకను వేటాడి వివాదంలో చిక్కుకున్న సల్మాన్ ఖాన్.. బిష్ణోయ్ వర్గానికి క్షమాపణలు చెప్పని నేపథ్యంలో.. అతడిపై హత్య బెదిరింపులు వస్తున్నాయి. 

సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ..పబ్లిక్ గానే వార్నింగ్ ఇచ్చాడు లారెన్స్ బిష్ణోయ్. దాంతో బాలీవుడ్ హీరోకు భారీగా బద్రతను కల్పించింది ప్రభుత్వం. దాంతో పాటు అతని ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉండటంతో సల్మాన్ ఖాన్ కాస్త సురక్షితంగా ఉండగలుగుతున్నారు.  ఇక సినిమాలు, కాంట్రవర్సీలతో పాటు.. సల్మాన్ ఖాన్ తన మంచి మనసును కూడా చాటుకున్నారు ఓ సందర్భంలో.. ఇంతకీ ఆయన ఏం చేశారంటే..? 
 

Latest Videos


ఇది ఇప్పటి సంగతి కాదు. దాదాపు  14 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో సల్మాన్ ఖాన్ క్యాన్సర్ తో బాధపడుతున్న నాలుగేళ్ల బాలిక ప్రాణాలను కాపాడాడు! బాలికకు బోన్ మ్యారో దానం చేశారు. ఇండియాలో ఇలా చేసిన మొదటి వ్యక్తి అతనే అని సోషల్ మీడియా కోడై కూసింది. ఇక ఇలా చేయడంతో  సల్మాన్ ఖాన్ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరో అయిపోయాడు. .

ఇది 2010లో జరిగింది. సల్మాన్ ఖాన్ ఓ వేదికపై ఓ అమ్మాయి ప్రాణాలను కాపాడుతానని హామీ ఇచ్చాడు. అది నెరవేరింది. బాలిక బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతుండగా, చికిత్స కోసం బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వచ్చింది. సల్మాన్ ఖాన్ ఎదుట గుమిగూడిన ప్రజలకు బాలిక తల్లి విజ్ఞప్తి చేసింది. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ సహాయం కోసం అభ్యర్ధించింది.  అప్పుడు సల్మాన్ ఖాన్ తన బోన్ మ్యారో సరిపోలితే దానం చేస్తానని వేదికపై నుండి హామీ ఇచ్చాడు. 
 

దీని తర్వాత సల్మాన్ ఖాన్ అనుకున్న మాట నిలబెట్టుకున్నాడు.  దీని ద్వారా, అతను భారతదేశపు మొట్టమొదటి ఎముక మజ్జ దాత అయ్యాడు. ఈ ఘటన జరిగి 14 ఏళ్లు కావస్తున్నా ఆ అమ్మాయి గురించి మాత్రం ఇంత వరకూ ఎవరికి తెలియదనే చెప్పాలి.  టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక నివేదిక ప్రకారం, భారతదేశంలోని బోన్ మారో డోనర్ రిజిస్ట్రీలో సల్మాన్ ఖాన్ పేరు కనిపించింది. నాలుగేళ్ల బాలిక పూజ గురించి తెలుసుకున్న సల్మాన్ ఖాన్ మొదట్లో తన ఫుట్‌బాల్ జట్టు నుండి విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. అయితే చివరి క్షణంలో జట్టు వెనక్కి తగ్గింది. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ మరియు అతని సోదరుడు అర్బాజ్ ఖాన్ మాత్రమే విరాళం ఇచ్చారు. 

Salman Khan Donor

ఆ తర్వాత సల్మాన్‌ఖాన్‌ బోన్‌ మ్యారోను దానం చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఎముక మజ్జ దానం రక్త క్యాన్సర్‌తో సహా అనేక రకాల రక్త రుగ్మతలతో బాధపడుతున్న రోగులను రక్షించగలదు. ఒక వ్యక్తి బోన్ మ్యారో దానం చేయడానికి ముందుకొస్తే.. చాలా మంది అదే బాటలో నడుస్తారని సల్లూ  భాయ్ అన్నారు.  ఈ విషయంలో సల్మాన్ ఖాన్ దాతృత్వాన్ని సునీల్ శెట్టి తో పాటు బాలీవుడ్ స్టార్స్ ఎంతో మంది ప్రశంసించారు. ఇక ఫ్యాన్స్ అయితే దిల్ ఖుష్ అవుతున్నారు. 

click me!