ఒకప్పుడు టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలు ఎక్కువగా వచ్చేవి. ఎన్టీఆర్, ఏఎన్నార్ అనేక చిత్రాల్లో కలసి నటించారు. ఆ తర్వాత కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు లాంటి హీరోలు కలసి అనేక చిత్రాలు చేశారు. కానీ ఇటీవల మల్టీస్టారర్ చిత్రాలు తగ్గిపోయాయి. చాలా రోజుల తర్వాత అసలు సిసలైన మల్టీస్టారర్ గా ఆర్ఆర్ఆర్ చిత్రం అలరించింది.