వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..

Published : Sep 22, 2026, 11:30 PM IST

Bigg Boss Telugu 10: నామినేషన్ల టైమ్ వచ్చిందంటే చాలు.. బిగ్ బాస్ హౌస్ చేపల మార్కెట్ కంటే దారుణంగా తయారయ్యింది. నామినేషన్లు వేసేది ఒకరైతే.. మధ్యలో మరికొంత మంది వచ్చి గొడవను పెద్దది చేస్తున్నారు. ఈక్రమంలో డే 16న బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందంటే?

PREV
15
బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ల గొడవలు..

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో నామినేషన్ ప్రక్రియ ఎప్పుడూ ఏదో ఒక గొడవలతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ముఖ్యంగా డే 16 ఎపిసోడ్‌లో నామినేషన్ల‌ు రెండో రోజు హౌస్‌మేట్స్ మధ్య వాడివేడి విమర్శలు, మాటల యుద్ధాలు తారస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు, గ్రూప్ పాలిటిక్స్ , ఊహించని ట్విస్టులతో బిగ్ బాస్ హౌస్ ఒక్కసారిగా వేడెక్కింది.

నామినేషన్లలో మాటల తూటాలు - గ్రూప్ గేమ్స్

ఈ ఎపిసోడ్‌లో ప్రధానంగా కంటెస్టెంట్ల మధ్య ఉన్న పాత పగలు, గేమ్ స్ట్రాటజీలు బయటపడ్డాయి. ముఖేష్, చరణ్‌ని నామినేట్ చేస్తూ "గేమ్‌లో ఆలస్యంగా స్పందిస్తున్నావు, మెచ్యూరిటీ లోపించింది" అని చెప్పాడు. దానికి చరణ్ స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇస్తూ, "నువ్వు అస్సలు ప్లేయర్‌గానే పనికిరావు, వెళ్లి పడుకో" అని సెటైర్ వేయడం గమనార్హం. వీళ్లిద్దరి నామినేషన్ల వేళ వర్షిణి, షాలినీ మధ్య పెద్ద గొడవే జరిగింది. షాలినీ నామినేట్ చేస్తుంటే మధ్యలో ముఖేష్, త్రిగుణ్ కలగజేసుకోవడాన్ని వర్షిణి తీవ్రంగా నిలదీసింది. త్రిగుణ్‌ను "శకుని లాగా ప్రతీ విషయంలో మధ్యలో దూరకు" అంటూ ఘాటుగా విమర్శించింది.

25
ఇంకా చల్లారని సుధీర్ -సృష్టి వివాదం...

గత కొన్ని రోజులుగా నడుస్తున్న సుధీర్ - సృష్టి వ్యవహారం ఈ నామినేషన్లలో మరింత ముదిరింది. 'పళ్లు రాలగొడతా' అనే పదంపై చర్చ రాగా, సుధీర్ తన అభిప్రాయాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. సృష్టి మాత్రం సుధీర్ డబుల్ ఫేస్ ఆడుతున్నాడని ఆరోపించింది. ఈ వాదన తారా స్థాయికి చేరి.. ఒకరిని మరొకరు గట్టిగా విమర్శించుకున్నారు. చివరకు సృష్టి సుధీర్ ను నామినేట్ చేసింది.

35
దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్

ఈ రోజు ఎపిసోడ్‌లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం దేబ్జానీ మోదక్ ఎదుర్కొన్న పరిస్థితులు. బిగ్ బాస్ హౌస్‌లో దేబ్జానీకి ఉన్న ప్రత్యేక సేఫ్‌గార్డ్ లేదా 'లైఫ్‌లైన్' ఈ నామినేషన్ల ప్రక్రియతో దెబ్బతింది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ముఖేష్ కు బిగ్ బాస్ రెండు ఆప్షన్లు ఇచ్చాడు. ముఖేష్ తన తండ్రితో ఉన్న ఫోటో కావాలంటే.. దేబ్జానీ కి కానీ వర్షిణికి కాని టెన్షన్ ఇవ్వాలి. ఈక్రమంలో వర్షిణికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన ముఖేష్.. దేబ్జానీకి తన ఇంటి నుంచి వచ్చిన తల్లీ తండ్రుల లెటర్ ను ఆపేసి ఆమెకు అన్యాయం చేశాడు. దాంతో బోరున విలపించిన దేబ్జానీ.. ముఖేష్ చేసిన పనికి చాలా బాధపడింది.

45
కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్

నామినేషన్స్ ముగిసిన వెంటనే బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌ను ప్రారంభించారు. లివింగ్ ఏరియా , గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన బజర్లను మోగించి పెట్టెను నెట్టే టాస్క్‌లో ముఖేష్ . రోహిత్ హోరాహోరీగా తలపడ్డారు. పెట్టె ఎల్లో లైన్ దాటిందా లేదా అనే విషయంలో ముఖేష్ గ్యాంగ్ (దేబ్జానీ, వర్షిణి, రాం ప్రసాద్) ఒకలా, త్రిగుణ్ టీమ్ మరొకలా వాదించడంతో సంచాలక్‌గా ఉన్న అమన్ తీవ్ర సందిగ్ధంలో పడిపోయాడు.

55
త్రిగుణ్ మైండ్ గేమ్‌పై హౌస్ అసహనం

హౌస్‌లో త్రిగుణ్ ఆడుతున్న స్ట్రాటజీలను సుధీర్, వర్షిణి, రాం ప్రసాద్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇతరుల గొడవల్లోకి వెళ్తూ గ్రూప్‌లను ప్రభావితం చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. "కంటెంట్ కోసం అందరినీ ట్రిగ్గర్ చేస్తున్నాడు" అని రోహిత్ కౌంటర్ ఇవ్వగా, ఇంట్లో ఉన్న ఇతర సభ్యులు కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు.మొత్తానికి బిగ్ బాస్ తెలుగు డే 16 ఎపిసోడ్ నామినేషన్ల పరంగా ఎంతో ఆసక్తికరంగా సాగింది. స్నేహాలు పక్కకు పోయి, కేవలం గేమ్ మాత్రమే ముఖ్యం అని కంటెస్టెంట్లు నిరూపించుకున్నారు. దేబ్జానీ లైఫ్‌లైన్ కోల్పోవడం, వర్షిణి-త్రిగుణ్ మధ్య కోల్డ్ వార్, సుధీర్-శ్రిష్టి గొడవలు రాబోయే రోజుల్లో హౌస్‌లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories